Central Government: నవంబర్ 31 వరకే డెడ్ లైన్.. ఈ పని చేయకపోతే వారికి నగదు కట్.. కేంద్రం అలర్ట్ జారీ..

Updated on: Oct 19, 2026 | 7:33 PM

మీరు ప్రతీ నెలా కేంద్ర ప్రభుత్వం లేదా ఏజెన్సీల నుంచి పెన్షన్ పొందుతున్నారా.. అయితే బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం కలీక సూచనలు జారీ చేసింది. లైఫ్ సర్టిఫికేట్ దాఖలు చేసేందుకు గడువు ఫిక్స్ చేసింది. దీంతో ఈ గడువులోగా జీవిత ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

1 / 5
కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. పెన్షన్‌దారులు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. నవంబర్ 30 వరకు మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు సమయం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో నెలనెలా పెన్షన్ పొందేవారు ఈ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. గడువులోగా సమర్పించకపోతే పెన్షన్ నిలిచిపోయే అవకాశముంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పెన్షన్‌దారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.

2 / 5
పెన్షన్ పొందేవారు ప్రతీ ఏడాది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అందించడంలో విఫలమైతే.. పెన్షన్ చెల్లింపులు నిలిచిపోవచ్చు. పెన్షన్ తీసుకునే వ్యక్తి జీవించే ఉన్నాడని నిరూపించుకునేందుకు ఈ పత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిధులను విడుదల చేస్తోంది. నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు దీనిని గడువు ఉంటుంది.

3 / 5
అయితే 80 ఏళ్లపైబడి వయస్సు ఉన్న పెన్షనర్లు అక్టోబర్ 1వ తేదీ నుంచే దీనిని సమర్పించవచ్చు. అయితే ఈ పత్రాన్ని సమర్పించేందుకు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా దీనిని సబ్మిట్ చేసే అవకాశముంది. తన మొబైల్ నుంచే పెన్షనర్లు సమర్పించవచ్చు. జీవన్ ప్రమాణ్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఉపయోగించి ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించవచ్చు. ఆధార్ బయోమోట్రిక్ ధృవీకరణ ప్రాసెస్ ద్వారా సబ్మిట్ చేయాలి.

4 / 5
ఇక కామన్ సర్వీస్ సెంటర్లు, ప్రభుత్వ కేంద్రాలు, ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. పెన్షన్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, బ్యాంక్ పాస్ బుక్ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇక పోస్టాఫీస్ ద్వారా కూడా ఈ పత్రం సమర్పించవచ్చు. ఇందుకోసం మీరు పోస్టాఫీస్‌కు వెళ్లాల్సిన పని లేదు.

5 / 5
పోస్టల్ సిబ్బందిని ఆశ్రయిస్తే వాళ్లే పెన్షనర్ ఇంటికి వస్తారు. అవసరమైన పత్రాలు వారికి అందించాలి. దీంతో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ అవకాశాన్ని కేంద్రం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని పెన్షనర్లు ఉపయోగించుకోవాలని పోస్టల్ శాఖ సూచిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us