
బంగారం కొనుగోలు చేసేవారికి భారీ గుడ్ న్యూస్. ధరలు తారుమారు అయ్యాయి. ఒక్కసారిగా ధరలు మారిపోయాయి. సోమవారం గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా కుప్పకూలాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో పసిడి ధరలు పతనమయ్యాయి. రెండు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు వాటికి బ్రేక్ పడింది. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. సోమవారం వివిధ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,130 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,50,930 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.1800 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,700 వద్ద ట్రేడవుతుండగా.. నిన్న రూ.1,38,350 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.1650 తగ్గుముఖం పట్టింది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా అవే ధరలు ఉన్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,170గా ఉండగా.. నిన్న రూ.1,52,180 వద్ద కొనసాగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,490 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఆ ధర రూ.1,39,500గా ఉంది. ఇక బెంగళూరులో కూడా గోల్డ్ రేట్లు పడిపోయాయి.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,49,130గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,700 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,49,280గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,850 వద్ద ఉన్నాయి.

ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక చెన్నైలో రూ.2,54,900 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక బెంగళూరులో రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. అటు హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.