
Jio Plan: రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ తన వినియోగదారులకు ఒక పెద్ద శుభవార్తను అందించింది. ఈ సంస్థ ఒక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో ఒక ముఖ్యమైన సర్వీసును ఏకంగా 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది.

ప్లాన్ ధర: రిలయన్స్ జియో ఈ చవకైన, జనాదరణ పొందిన రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 889. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 84 రోజుల దీర్ఘకాలిక వ్యాలిడిటీ లభిస్తుంది. డేటా ప్రయోజనాలు: ఈ ప్లాన్ రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. దీనితో 84 రోజులకు మొత్తం 126 GB డేటా లభిస్తుంది. రోజువారీ డేటా ఉపయోగం కోసం ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి.

కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు: ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. వారు రోజుకు 100 ఉచిత SMSలను కూడా పంపవచ్చు. డేటాతో పాటు కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు కోరుకునే వారికి ఈ రీచార్జ్ ప్లాన్ బెస్ట్ అనే చెప్పాలి.

గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్: ఈ ప్లాన్ ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే ఇది 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రోకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ రోజుల్లో AI మరింత అభివృద్ధి చెందుతోంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో అదనపు సమాచారం పొందవచ్చు. అందుకే సబ్‌స్క్రిప్షన్ పొందకుండానే ఇదే రీఛార్జ్ ప్లాన్‌లో ఉచితంగా పొందే అవకాశం అందిస్తోంది జియో.

ఇతర ప్రయోజనాలు: అంతేకాకుండా ఈ చౌకైన రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు, జియో వినియోగదారులు మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ సదుపాయాన్ని కూడా పొందే అవకాశం దక్కించుకోవచ్చు. అలాగే జియోటీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు.