సామాన్యులకు పిడుగులాంటి వార్త.. ఒకేసారి పెరిగిన ఫోన్లు, టీవీలు ధరలు.. ఎంతంటే..?

Updated on: Nov 25, 2026 | 9:17 AM

Electronics Price Hike: దీపావళి షాపింగ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ కంపెనీలు సామాన్యులకు షాకిచ్చాయి. ధరలను భారీగా పెంచేశాయి. స్మార్ట్‌ఫోన్, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ఏసీ వంటి పరికరాల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించాయి. అలాగే కార్ల ధరలను కూడా పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల తమపై భారం పడుతుందని కంపెనీలు చెబుతున్నాయి.

1 / 5
దీపావళి పండుగ తర్వాత నుంచి ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ల కంపెనీలు పెంచేస్తున్నాయి.  పండుగ సీజన్ ముగిసిన కేవలం రెండు వారాలకే పలు కంపెనీలు తమ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచేశాయి. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీల వంటి వాటి ధరలను పెంచుతున్నాయి. 2026 సంవత్సరంలో ఇప్పటికే పలుమార్లు ధరలను పెంచేశాయి.

2 / 5
శాంసంగ్, షియోమి ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను 18.75 శాతం వరకు పెంచాయి. నవంబర్ 15-16 తేదీల నుండి సవరించిన ధరలను అమల్లోకి తీసుకొచ్చాయి. గతంలో రూ. 20,999కి లభించిన శాంసంగ్ గెలాక్సీ A07 5G (4GB+128GB) ధర ఇప్పుడు రూ. 22,999కి పెంచింది. అంటే ఒకేసారి రూ. 2,000 పెరిగింది.

3 / 5
అదేవిధంగా, షియోమీ రెడ్‌మీ A7 ప్రో 5G (4GB+128GB) ధర ఒకేసారి రూ. 3,000 పెరిగింది. గతంలో ఉన్న రూ. 15,999 నుండి రూ. 18,999కి చేరింది. శాంసంగ్ గెలాక్సీ A57, షియోమీ రెడ్‌మీ నోట్ 17 ప్రో 5G వేరియంట్ల ధరలు కూడా రూ. 4 వేల వరకు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్లతో పాటు షియోమి టీవీ ధరలను 7 శాతం వరకు పెంచగా.. హైయర్, గోద్రెజ్ సంస్థలు కూడా తమ అన్ని ఉత్పత్తుల ధరలను 7 శాతం వరకు పెంచేశాయి.

4 / 5
రాగి, అల్యూమినియం, ఉక్కు, ప్లాస్టిక్‌లు,ఇతర పారిశ్రామిక ముడిసరుకులు మరింతగా పెరిగాయి. సరుకు రవాణా, రవాణా ఖర్చులు ఈ భారాన్ని మరింత పెంచాయి. బలహీనపడుతున్న రూపాయి, మారకపు రేటులోని అస్థిరత వంటివి దిగుమతి చేసుకున్న విడిభాగాలు, ముడి పదార్థాలపై ఆధారపడిన కంపెనీలపై మరో స్థాయి ఒత్తిడిని పెంచాయి.

5 / 5
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా కొన్ని మోడళ్లపై వాల్యూమ్-వెయిటెడ్ యావరేజ్ ప్రాతిపదికన సుమారు 0.31 శాతం ధరలను పెంచింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPV), హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఆడి ఇండియా కూడా ధరలను పెంచేశాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్ తమ ధరల సవరణలను డిసెంబర్ 1 నుండి అమలు చేయనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us