Gold: హాల్‌మార్క్‌ చూసి మోసపోకండి.. నకిలీ బంగారం కావొచ్చు! అసలైన దాన్ని ఇలా గుర్తించండి!

Updated on: Apr 27, 2026 | 6:00 AM

బంగారం కొనడం ఆర్థిక నిర్ణయం, స్వచ్ఛత ముఖ్యం. నకిలీ హాల్‌మార్క్‌లతో మోసాలు పెరుగుతున్నందున, స్వయంగా ధృవీకరించుకోవాలి. BIS HUID, BIS కేర్ యాప్ ద్వారా అసలు బంగారాన్ని గుర్తించవచ్చు. ఇంట్లో అయస్కాంతం, నీటి పరీక్ష, సిరామిక్ ప్లేట్ వంటి పద్ధతులతో ప్రాథమిక పరీక్షలు చేసి, మీ కష్టార్జితాన్ని నకిలీ బంగారం మోసాల నుండి కాపాడుకోండి.

1 / 5
బంగారం కొనడం అంటే కేవలం ఆభరణం కొనడం కాదు, అది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. అందుకే స్వచ్ఛత (ప్యూరిటీ) విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఒకప్పుడు కంసాలి నమ్మకం చాలు అనుకునేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. హాల్‌మార్కింగ్ ఉన్నప్పటికీ, నకిలీ ముద్రలతో మోసాలు పెరుగుతున్నాయి. అందుకే మీరు స్వయంగా కొన్ని పద్ధతులతో బంగారం నిజమో కాదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

2 / 5
మొదటగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెడ్స్‌ (BIS) హాల్‌మార్కింగ్ విధానం గురించి తెలుసుకోవాలి. ప్రతి అసలైన ఆభరణంపై HUID (హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫీకేషన్‌) అనే ప్రత్యేక కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను ధృవీకరించడానికి BIS Care App ఉపయోగించాలి. యాప్‌లో Verify HUID ఆప్షన్‌లో మీ ఆభరణంపై ఉన్న 6 అంకెల కోడ్‌ను ఎంటర్ చేస్తే, ఆభరణం వివరాలు వెంటనే కనిపిస్తాయి. ఏ సమాచారం రాకపోతే అది నకిలీ అయ్యే అవకాశాలు ఎక్కువ.

3 / 5
ఇంటి వద్ద సులభంగా చేసే పరీక్షల్లో అయస్కాంత పరీక్ష ఒకటి. బంగారం ఒక అయస్కాంతేతర లోహం. అంటే అది మాగ్నెట్‌కు అంటుకోదు. మీ ఆభరణం మాగ్నెట్‌కు ఆకర్షితమైతే, అందులో ఇతర లోహాలు ఎక్కువగా కలిపి ఉండే అవకాశం ఉంది. ఇంకో సాధారణ పద్ధతి సాంద్రత పరీక్ష. బంగారం చాలా భారీ లోహం కాబట్టి, నీటిలో వేస్తే అది పూర్తిగా మునిగిపోతుంది. ఒక గ్లాసు నీటిలో ఆభరణాన్ని వేసి గమనిస్తే, అది తేలికగా కనిపిస్తే లేదా తేలిపోతే అనుమానం రావాలి. ఇది పూర్తిగా ఖచ్చితమైన పరీక్ష కాకపోయినా, ఒక అంచనా ఇవ్వగలదు.

4 / 5
అలాగే సిరామిక్ ప్లేట్ టెస్ట్ కూడా ఉపయోగపడుతుంది. ఒక తెల్లని సిరామిక్ ప్లేట్‌పై ఆభరణాన్ని స్వల్పంగా రుద్దితే, బంగారు రంగు గీత వస్తే అది నిజమైన బంగారం కావచ్చు. కానీ నల్ల లేదా ముదురు గీత వస్తే అది కల్తీకి సంకేతం.

5 / 5
ఇవన్నీ ప్రాథమిక పరీక్షలు మాత్రమే. పెద్ద మొత్తంలో బంగారం కొనేటప్పుడు ఎప్పుడూ నమ్మకమైన జువెలరీ షాప్‌నే ఎంచుకోవడం మంచిది. అలాగే బిల్ తీసుకోవడం, హాల్‌మార్క్ వివరాలు చెక్ చేయడం తప్పనిసరి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, మీ కష్టార్జిత డబ్బును నకిలీ బంగారం మోసాల నుండి సురక్షితంగా కాపాడుకోవచ్చు.

Follow Us