Gold Prices Today: ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో భారీ కుదుపు.. ఒక్కరోజే రూ.10 వేలు.. పండక్కి కష్టమే..

Updated on: Nov 05, 2026 | 10:16 AM

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమితో పసిడి ధరల్లో భారీ కుదుపు చోటుచేసుకుంది. ధరలు ఉన్నట్లుండి ఒక్కరోజే భారీగా పుంజుకునున్నాయి. దీపావళి నాటికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పండకి గోల్డ్, సిల్వర్ కొనాలనుకునేవారిపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

1 / 5
దీపావళికి ముందే బంగారం ధరలు భారీగా షాకిచ్చాయి. ధరలు ఊహించని రీతిలో పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో ధంతేరస్, దీపావళికి పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది పెద్ద షాకింగ్ పరిణామంగా చెప్పవచ్చు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌పై తిరుగుబాటు జరగడంతో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి గోల్డ్ రేట్లు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. రోజురోజుకి ధరలు పుంజుకుంటుండటంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

2 / 5
నవంబర్ 5వ తేదీన గురువారం బంగారం ధరలు ఏకంగా రూ.3,220 ఎగబాకాయి. స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే పసిడి ధరల్లో భారీ ర్యాలీ దిశగా దూసుకెళ్లాయి. దీంతో ఈ పెరుగుదల తర్వాత హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,020 వద్ద ఉండగా.. నేడు ఒక్కరోజే రూ.3220 పెరిగింది. అటు 22 క్యారెట్ల ధర రూ.1,33,850గా కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.2950 పుంజుకుంది.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,170 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,000గా కొనసాగుతున్నాయి. చెన్నై, బెంగళూరులో కూడా 24 క్యారెట్ల రేటు రూ..1,46,020గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,33,850 పలుకుతున్నాయి.

4 / 5
ఇక వెండి ధరలు అయితే ఏకంగా రూ.10 వేలు పెరిగాయి. ఈ పెరుగుదల తర్వాత ఇవాళ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.2,10,000 వద్ద కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చెన్నై, బెంగళూరులోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి.

5 / 5
ట్రంప్ ఓటమితో డాలర్ విలువ భారీగా పతనమైంది. దీంతో తక్కువ యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్‌కు మద్దతు పెరగడంతో స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగింది. ప్రస్తుతం ఔన్సుకు 3,931.24 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావం ధంతేరస్‌కు బంగారం కొనుగోలు చేసేవారిపై ప్రభావం చూపనుంది. దీంతో కొనుగోళ్లు స్థిరంగా ఉంటాయని మార్గెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us