
మీరు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారాలా..? మీ పీఎఫ్ అకౌంట్‌ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మార్చాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుంచి కంపెనీ మారకపోతే మీరు సులువుగా పీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో 3.0 కొత్త వ్యవస్థ గురించి పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం

మీరు ఇప్పటివరకు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారగానే పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉండేది. మాన్యువల్ పద్దతిలో ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేంది. కానీ ఇప్పటినుంచి యాజమానుల జోక్యం లేకుండా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. గతంలో ఇందుకోసం కొన్ని రోజుల పాటు సమయం పట్టేది. కానీ ఇక నుంచి రెండు, మూడు రోజుల్లో బదిలీ క్లెయిమ్స్ పూర్తవుతాయి.

ఫిబ్రవరి 25, 2026 నాటికి సిబ్బంది లేదా యజమాని జోక్యం లేకుండా ఏడు మిలియన్లకుపైగా బదిలీ క్లెయిమ్‌లు పూర్తయ్యాయి. మనుపటి వ్యవస్థతో పోలిస్తే ఈ కొత్త మార్పులతో కంపెనీలు మారేవారికి ప్రయోజనం చేకూరనుంది. పీఎఫ్ ఖాతా బదిలీ కోసం గత లేదా ప్రస్తుత యజమాని ఆమోదం పొందాలనే నిబంధనలను తొలగించారు. కేవైసీ పూర్తి చేసుకున్నవారికి ఈ అవకాశం కల్పించారు.

ఇక పీఎఫ్ నగుదు క్లెయిమ్ కోసం ఆటో సెటిల్మెంట్ విధానం తీసుకొచ్చారు. రూ.5 లక్షల్లోపు వరకు ఆటో సెటిల్మెంట్ చేస్తారు. ఇంతకముందు ఆటో సెటిల్మెంట్ పరిమితి రూ.లక్ష ఉండగా.. ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచారు. 2026, ఫిబ్రవరి 25 నాటికి 3,52,20,199 క్లెయిమ్స్ జరిగాయి. మాన్యువల్ ప్రాసెస్‌ను తగ్గించడానికి ఆటోసెటిల్మెంట్ విధానం ప్రవేశపెట్టారు.

సుమారు రూ.51,620 కోట్ల విలువైన 70 శాతానికిపైగా ముందస్తు ఉపసంహరణ రిక్వెస్ట్‌లు విజయవంతంగా పరిష్కరించబడ్డాయి. ఇక ప్రతీ ఈపీఎఫ్‌వో కార్యాలయం సీపీపీఎస్‌కు మారిందని పార్లమెంట్‌లో కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి కరంద్లాజే స్పష్టం చేశారు. 7 మిలియన్ల మంది ఖాతాదారులకు ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయాలు పీఎఫ్ సేవలను క్రమబద్దీకరించడం, ఖాతాదారులకు వినియోగదారుల అనుభవాన్ని గణనీయంగా మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది.