
Electric Cars: గత రెండు నెలల్లో పండుగ సీజన్లో అనేక కొత్త కార్లు విడుదలయ్యాయి. ఇప్పుడు రాబోయే నవంబర్ నెలలో భారత మార్కెట్లో అనేక కొత్త కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ నవంబర్ జాబితాలో ప్రధానంగా ప్రీమియం, లగ్జరీ కార్లు ఉన్నాయి. ముఖ్యంగా మెర్సిడెస్-బెంజ్, BYD వారి 'డెంజా' బ్రాండ్, JSW మోటార్స్ వారి కొత్త మోడళ్లు వినియోగదారులలో గొప్ప ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నవంబర్‌లో విడుదల కానున్న ఈ ప్రధాన కార్ల పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మెర్సిడెస్-బెంజ్ GLC ఎలక్ట్రిక్: లగ్జరీ కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, మెర్సిడెస్-బెంజ్ తన కొత్త GLC ఎలక్ట్రిక్ కారును నవంబర్ 4న భారతదేశంలో విడుదల చేస్తోంది. అంచనా ధర - రూ. 80 లక్షల నుండి 85 లక్షల వరకు. దీనికి 94kWh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ఉంది. పరీక్షల డేటా ప్రకారం, ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 715 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీనిలోని రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 490 hp శక్తిని మరియు 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు ప్రధాన లక్షణం ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్.

Denza D9, Z9 GT (Denza D9, Z9 GT): చైనా కంపెనీ BYD లగ్జరీ కార్ బ్రాండ్ 'డెంజా' నవంబర్ 13న భారతదేశంలో అధికారికంగా ప్రారంభిస్తోంది. ఈ రోజున 'డెంజా D9' 'డెంజా Z9 GT' అనే రెండు మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన ఈ లగ్జరీ MPVలో 103kWh బ్యాటరీ ఉంది. దీని ముందు భాగంలోని ఎలక్ట్రిక్ మోటార్ 313 hp శక్తిని, 360 Nm టార్క్‌ను అందిస్తుంది. అంతర్జాతీయ WLTP ప్రకారం.. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 520 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. స్పోర్టీ 'షూటింగ్ బ్రేక్' డిజైన్‌తో ఉన్న ఈ ఎలక్ట్రిక్ మోడల్లో 122.5kWh బ్యాటరీ మరియు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్లు కలిసి 1156 hp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. WLTP డేటా ప్రకారం, 600 కిలోమీటర్ల రేంజ్ అందించే ఈ కారు ధర రూ. 80 లక్షల నుండి రూ. 1 కోటి మధ్య ఉండవచ్చు.

JSW కాంబాట్: ఉక్కు, సిమెంట్ రంగాలలో అగ్రగామి అయిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, ఎంజీ మోటార్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ కంపెనీ తన సొంత బ్రాండ్‌తో కార్లను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. JSW చైనా ఆటోమొబైల్ కంపెనీ చెరీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ చెరీ జెటూర్ T2 మోడల్‌కు 'JSW కాంబాట్' అని పేరు మార్చి మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కొత్త కారు నవంబర్ 15న భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్: భారతీయ వినియోగదారులలో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ నవంబర్ 26న విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. అంచనా ధర - రూ. 20 లక్షల నుండి రూ. 34 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). కొత్త మోడల్లో ముందు డిజైన్, గ్రిల్, హెడ్లైట్లు, క్యాబిన్ ఫీచర్లలో ప్రధాన మార్పులు ఉంటాయి. ప్రస్తుత 2.0-లీటర్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లు కొనసాగుతాయి. ఆటోమొబైల్ పరిశ్రమలో E85 (ఫ్లెక్స్-ఫ్యూయల్) మోడల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు వదంతులు ఉన్నాయి.