
ఇక బహ్రెయిన్‌లో కూడా ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. 40 వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతకంటే ఎక్కువ సంపాదించేవారిపై 15 శాతం పన్ను విధిస్తారు. ఇక చమురు, గ్యాస్ కంపెనీలు, విదేశీ బ్యాంకులపై 40 శాతం పన్ను అనేది ఉంటుంది. ఇక బహామాస్ దేశంలో కూడా వ్యక్తిగత ఆదాయం, మూలధన లాభాలు, గిఫ్ట్‌లు, వారసత్వ ఆస్తులు అనేది పూర్తిగా రహితం. అయితే బహామాస్‌లో వస్తువులు, సేవలపై వ్యాట్, స్టాంప్ డ్యూటీ ఉంటుది. అలాగే మొనాకో దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది సున్నా. అయితే కంపెనీలపై 10 శాతం పన్ను ఉంటుంది.

ఇక యూఏఐ అనేది కూడా జీరో ట్యాక్స్ ఫ్రీ దేశం. ఇక్కడి ప్రజలు ఎలాంటి వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం అనేది ఉండదు. ఇక ఒమన్ కూడా ట్యాక్స్ ఫ్రీ దేశమే. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపులు ఉంటాయి. ఇక ఆస్తి, సంపద, మూలధన లాభాల నుంచి వచ్చే ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు.

ఇక ఖతార్‌లో కూడా ఎలాంటి వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను అనేది ఉండదు. అయితే అన్ని వస్తువులు, సేవలపై 5 శాతం వ్యాట్ అనేది ఉంటుంది. ఇక కొన్ని కంపెనీలపై పన్నులు, సుంకాలు, నియంత్రణ రుసుంలు అనేవి ఉంటాయి. ఇక కువైట్‌లో కూడా ఎలాంటి వ్యక్తిగత ట్యాక్సులు ఉండవు. దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు వంటి కొన్ని పరోక్ష పన్నులు ఉంటాయి.

దుబాయ్‌లో చాలా వ్యాపారాలపై ఎలాంటి పన్ను ఉండదు. ఇక డివిడెండ్లు, వడ్డీపై విత్ హోల్డింగ్, మూలధన లాభాలపై కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే దుబాయ్‌లో చమురు కంపెనీలపై మాత్రం 55 శాతం పన్ను అమల్లో ఉంది. ఇక వీటిపై వ్యాట్స్, ఎక్సైంజ్ సుంకం, దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు వంటివి కొన్ని పన్నులు, రుసుములు ఉన్నాయి.

ఇండియాలో మనం సంపాదించే ఆదాయంపై ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక వ్యక్తిగతంగా సంపాదించే ఆదాయంపైనే కాకుండా వ్యాపార సంస్థలు కూడా తమకు వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని ట్యాక్స్ మినహాయింపులు ఇస్తూ పన్ను చెల్లింపుదారులకు అనేక ఊరట కలిగిస్తూ ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో అసలు ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. మీరు సంపాదించే ఆదాయంపై ఎలాంటి పన్ను కట్టాల్సిన పని లేదు. ఆ దేశాలు ఏంటంటే..?