
కొత్త వారం వచ్చేయడంతో బ్యాంక్ సెలవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బ్యాంక్‌లను సంప్రదించాలనుకునేవారు, రోజువారీ అవసరాల కోసం లావాదేవీలను ప్లాన్ చేసుకునేవారు ఈ సెలవుల గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది. దీని వల్ల ఇబ్బందులు పడకుండా ఉంటారు. బ్యాంక్ సెలవులు రాష్ట్రాన్ని బట్టి వేర్వురుగా ఉంటాయి. దీంతో బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి అనుకున్నప్పుడు ముందుగానే మీ ప్రాంతంలో బ్యాంక్ సెలవులు గురించి తెలుసుకోండి.

ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 2 నుంచి 8 వరకు బ్యాంక్ సెలవుల విషయానికొస్తే.. ఈ వారం రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఒక రోజు మూతపడనున్నాయి. నవంబర్ 8వ తేదీన దీపావళి, ఆదివారం రావడంతో బ్యాంకులకు సాధారణ సెలవుదినంగా చెప్పవచ్చు. దీంతో ఆ రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు ఈ సెలవు వర్తిస్తుంది.

ఆర్బీఐ రూల్స్ ప్రకారం అన్ని షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు సెలవులను పాటించాల్సి ఉంటుది. ఇక ప్రతీ నెల రెండు, నాలుగో శనివారాలు, ప్రతీ ఆదివారం బ్యాంకులు మూతపడతాయియి. అయితే సెలవు రోజుల్లో ఆన్ లైన్ సేవలు పనిచేస్తాయి. దీంతో ఇంటర్నె్ట్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ విధావనం ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహించుకోవచ్చు. వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా స్టేట్ మెంట్, బ్యాలెన్స్ చెకింగ్ లాంటి సేవలు పొందవచ్చు.

ఆర్బీఐ ప్రతీ ఏడాది జనవరిలో వార్షిక సెలవుల క్యాలెండర్ విడుదల చేస్తోంది. జాతీయ సెలవులు, గెజిటెడ్ సెలవులు, వారాంతరపు సెలవులు అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి. అయితే ప్రాంతీయ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. రాష్ట్రాల అధికారిక పండుగలు, ప్రాంతీయ పండుగల ఆధారంగా ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొలా ఈ సెలవులు ఉంటాయి. దీంతో ప్రాంతీయ సెలవుల గురించి తెలుసుకుని ఉండాలి.

ఇక నవంబర్‌లో 8వ తేదీన ఆదివారం, దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. నవంబర్ 9న లక్షీపూజ సందర్భంగా అగర్తలా, భోపాల్, చండీగఢ్, గాంగ్టక్, ఇంఫాల్, జైపూర్, కాన్పూర్, లక్నోలలో బ్యాంకులు మూతపడనున్నాయి. నవంబర్ 10న కూడా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు ఉండవు.