ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. వైట్ vs బ్రౌన్ ఎగ్‌.. రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?

Updated on: Oct 11, 2026 | 8:47 AM

గుడ్లు.. తక్కువ ధరకే ఎక్కవ పోషకాలు అందించే ఏకైక ఆహారం.. వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మార్కెట్‌లో మనకు ఒకటి తెలుగు, మరొకటి బ్రౌన్ రెండు రకాల ఎగ్స్‌ దొరుకుతాయి. చాలా మంది తెల్లగుడ్డు కన్నా, బ్రౌన్‌ గుడ్డులో పోషకాలు ఎక్కవగా ఉంటాయని నమ్ముతారు. మరీ ఇందులో వాస్తవం ఎంత.. ఈ రెండు గుడ్ల మధ్య అసలు తేడాలు ఏంటి? ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1 / 5
గుడ్లు కలర్ మారినంతా మాత్రానా ప్రయోజనాలు కూడా మారుతాయా అంటే అస్సలు కాదు.. గుడ్డు పెంకు రంగు అనేది పూర్తిగా కోడి జాతి, జన్యువుల పై ఆధారపడి ఉంటుంది. మొదట్లో కోడి శరీరంలో ఉత్పత్తి అయ్యే గుడ్లన్ని తెలుపురంగులోనే ఉంటాయి. కానీ ఆ కోడి జాతి జన్యువుల్లో పెంకుకు రంగునిచ్చే లక్షణం ఉంటే, గుడ్డు తయారయ్యే చివరి దశలో రంగు మారుతుంది. ఈ వర్ణద్రవ్యాన్ని ప్రోటోపోర్ఫిరిన్ అంటారు.

2 / 5
ఇక ఈ రెండు గుడ్ల మధ్య పోషకాల విషయానికి వస్తే.. తెల్లగుడ్డు కన్నా, బ్రౌన్ కలర్ గుడ్డులో ఎక్కవ పోషకాలు ఉంటాయని అనుకుంటారు. కానీ రెండింటిలో పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి. రెండింటిలోనూ ఒకే పరిమాణంలో కేలరీలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. గుడ్డు పెంకు రంగుకు, అందులోని పోషకాలకు ఎలాంటి సంబంధం ఉండదు.

3 / 5
అయితే గుడ్డులోని పోషకాలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఏమిటంటే.. కోడి పెరిగే వాతావరణం. అవును పెరిగే క్రమంలో ఆ కోడి ఎలాంటి ఆహారం తీసుకుంటుంది అనే దానిపై ఆధారపడి పోషకాలు ఉంటాయి. ఒమేగా-3 సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకునే కోళ్ళు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే గుడ్లను పెడతాయి. అలాగే గ్రామాల్లో పెరిగే కోళ్లు విటమిన్ A, E ఎక్కువగా ఉండే నాణ్యమైన పచ్చసొన గల గుడ్లను పెడతాయి.

4 / 5
బ్రౌన్‌ ఎగ్‌లో ఎక్క పోషకాలు ఉంటాయనేది కేవలం ఒక అపోహ మాత్రమే. బ్రౌన్ గుడ్ల ధర కొంచెం ఎక్కువగా ఉండటానికి కారణం. వాటిని పెట్టే కోళ్లు పరిమాణంలో పెద్దవిగా ఉండి, ఎక్కువ దాణా తినడమే తప్ప వాటిలో ప్రత్యేక పోషకాలు ఉండటం వల్ల కాదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
అంతేకాదు కేవలం పోషకాలు మాత్రమే కాదు.. రుచిలోనూ రెండు గుడ్లలో ఎలాంటి లేడాలు ఉండవు. కానీ వండే విధానాన్ని బట్టి రుచి మారవచ్చని నిపుణులు అంటున్నారు. పోచింగ్ లేదా హాఫ్ బాయిల్ వంటి సాధారణ పద్ధతుల్లో గుడ్డు సహజ రుచి స్పష్టంగా తెలుస్తుంది. అదే ఎక్కువ మసాలాలు, డీప్ ఫ్రై చేసిన వంటకాల్లో ఆ రుచి అంతగా కనిపించదు. అంతేకాని.. గుడ్ల రంగుని బట్టి పోషకాలను అంచనా వేయడం సరికాదని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ సారి గుడ్లు కొనే ముందు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us