బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి

Updated on: Nov 01, 2026 | 8:45 AM

దీపావళి పండుగకు, ప్రత్యేక సందర్భాలలో ఎంతో ఇష్టంగా చేసుకునే పిండి వంటకాలలో జంతికలు కూడా ఒకటి. అయితే, శెనగపిండి, మినప్పిండి లేకుండా కూడా క్రిస్పీగా ఉండే జంతికలు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ రెసిపీతో జంతికలు చాలా సులభంగా, తక్కువ సమయంలో చేసుకోవచ్చు.

1 / 5
కావాల్సిన పదార్థాలు:  నీళ్లు: 3 కప్పులు, సాల్ట్: పావు టీస్పూన్, నూనె/నెయ్యి/వెన్న: 4 టేబుల్ స్పూన్లు,  బొంబాయి రవ్వ (సూజి/ఉప్మా రవ్వ): 1 కప్పు,  బియ్యం పిండి: 2.5 కప్పులు ,  కలోంజి సీడ్స్: 1 టేబుల్ స్పూన్ (నువ్వులు లేదా జీలకర్ర కూడా వాడవచ్చు),  వాము: పావు టీస్పూన్,  కారం: 1.5 టీస్పూన్ తీసుకోవాలి.  ముందుగా, స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 3 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు, పావు టీస్పూన్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనెకు బదులుగా నెయ్యి లేదా వెన్న కూడా ఉపయోగించవచ్చు. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు, ఒక చేత్తో ఒక కప్పు బొంబాయి రవ్వను నెమ్మదిగా పోస్తూ, ఇంకో చేత్తో గరిటెతో కలుపుకోవాలి. ఇలా చేస్తే రవ్వ ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. 1 కప్పు రవ్వకు 3 కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోతాయి.

2 / 5
రవ్వ చక్కగా కలిసి, దగ్గరపడిన తర్వాత, మంటను తగ్గించి, మూత పెట్టి రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉడికించాలి. రవ్వ మిశ్రమం బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి.ఇప్పుడు స్టవ్ ఆపి, వేడిగా ఉన్నప్పుడే గరిటెతో రవ్వ మిశ్రమాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. రవ్వ, రవ్వలా ఉండకుండా బాగా స్మూత్‌గా అయ్యేంత వరకు మూడు నాలుగు నిమిషాల పాటు కలపాలి.

3 / 5
బాగా మ్యాష్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని వెడల్పుగా ఉన్న ఒక పళ్లెంలోకి తీసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇది పూర్తిగా చల్లారకుండా, గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో 2 కప్పుల జల్లించిన బియ్యం పిండి వేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ (కలోంజి లేకపోతే నువ్వులు లేదా జీలకర్ర వేయవచ్చు), పావు టీస్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్ (సుమారు 1 టీస్పూన్), 1.5 టీస్పూన్ల కారం వేయాలి.

4 / 5
ముందుగా మసాలాలను బియ్యం పిండికి బాగా పట్టించి, ఆ తర్వాత రవ్వ మిశ్రమంతో బాగా కలపాలి. నీళ్లు అసలు పోయకూడదు. రవ్వలో ఉన్న తేమతోనే పిండి చక్కగా కలిసిపోతుంది. గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ రవ్వ వల్ల జంతికలు బాగా గుల్లగా వస్తాయి.
 పిండి కొంచెం సాఫ్ట్‌గా అనిపిస్తే, మరొక అర కప్పు బియ్యం పిండి వేసి బాగా కలపవచ్చు. అయితే, బియ్యం పిండి ఎక్కువైతే జంతికలు గట్టిగా వస్తాయని గుర్తుంచుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా కలుపుకోవాలి.

ముందుగా మసాలాలను బియ్యం పిండికి బాగా పట్టించి, ఆ తర్వాత రవ్వ మిశ్రమంతో బాగా కలపాలి. నీళ్లు అసలు పోయకూడదు. రవ్వలో ఉన్న తేమతోనే పిండి చక్కగా కలిసిపోతుంది. గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ రవ్వ వల్ల జంతికలు బాగా గుల్లగా వస్తాయి. పిండి కొంచెం సాఫ్ట్‌గా అనిపిస్తే, మరొక అర కప్పు బియ్యం పిండి వేసి బాగా కలపవచ్చు. అయితే, బియ్యం పిండి ఎక్కువైతే జంతికలు గట్టిగా వస్తాయని గుర్తుంచుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా కలుపుకోవాలి.

5 / 5
పిండిని మురుకుల గొట్టంలో పెట్టే ముందు, ప్రతిసారి పిండిని కొంచెం సేపు బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే జంతికలు మరింత గుల్లగా వస్తాయి. మీకు నచ్చిన స్టార్ ప్లేట్ లేదా జంతికల ప్లేట్ పెట్టి, పిండిని నింపి క్లోజ్ చేయాలి. ఒకవైపు స్టవ్ పైన నూనె పెట్టి మీడియం ఫ్లేమ్‌లో బాగా కాగనివ్వాలి. ఒక ప్లేట్ పైన కొంచెం నూనె రాసి, దాని పైన ఒక వాయికి సరిపడా జంతికలను ఒత్తి పెట్టుకోవాలి. నూనెలో వేసినప్పుడు ఒక చుట్టే వేయాలి. ఎక్కువ చుట్లు వేస్తే కాలడానికి ఎక్కువ సమయం పడుతుంది. నూనె బాగా కాగిన తర్వాత, ఒత్తుకున్న జంతికలను మెల్లగా నూనెలో వేయాలి. జంతికలు వేసిన వెంటనే కదపకూడదు. పచ్చిదనం తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత, రెండో వైపుకు తిప్పి, రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us