రూ.4 కోట్ల కరెన్సీ నోట్లతో వాసవీ మాత అలంకరణ.. భీమవరంలో ధనలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం!

Edited By:

Updated on: Oct 16, 2026 | 2:55 PM

శరన్నవరాత్రి ఉత్సవాల వేళ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భక్తి ప్రపత్తులు వెల్లివిరిశాయి. స్థానిక త్యాగరాజ భవనంలో జరుగుతున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి 59వ దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు కన్నులవిందుగా ‘ధనలక్ష్మి’ అవతారంలో దర్శనమిచ్చారు.ఏకంగా రూ. 4 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

1 / 5
శరన్నవరాత్రి ఉత్సవాల వేళ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భక్తి ప్రపత్తులు వెల్లివిరిశాయి. స్థానిక త్యాగరాజ భవనంలో జరుగుతున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి 59వ దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు కన్నులవిందుగా ‘ధనలక్ష్మి’ అవతారంలో దర్శనమిచ్చారు.

2 / 5

 ఏకంగా రూ. 4 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కరెన్సీ నోట్లు, స్వర్ణాభరణాల శోభ ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య వర్తక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి.

ఏకంగా రూ. 4 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కరెన్సీ నోట్లు, స్వర్ణాభరణాల శోభ ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య వర్తక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి.

3 / 5

రూ. 500, 200, 100, 50, 20, 10 ముఖవిలువ గల కరెన్సీ నోట్లతో తీర్చిదిద్దిన భారీ హారాలు, తోరణాలతో గర్భాలయాన్ని, మండపాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. కరెన్సీ నోట్లతో పాటు మేలిమి బంగారం, వెండి ఆభరణాలతో వాసవి మాతను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

4 / 5
ధనలక్ష్మి రూపంలో వెలిగిపోతున్న వాసవీ మాతను దర్శించుకునేందుకు భీమవరం పరిసర ప్రాంతాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం మహిళలు పెద్దఎత్తున కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు.

5 / 5
 అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులందరికీ నిర్వాహకులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us