
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు బియ్యం, 5 పెద్ద టమాటాలు, రెండు ఉల్లిపాయలు, క్యారెట్, బీరకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 బిర్యానీ ఆకులు , 4 లవంగాలు, 5 యాలకులు, దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్స్ కారం, పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ మసాలా, 3 టేబుల్ స్పూన్స్ నూనె, నెయ్యి, కొత్తిమీర, పుదీనాను తీసుకోవాలి.

ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని 10 నిమిషాల పాటు నానాబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి అది వేడయ్యాక దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి.

ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యేదాకా స్టవ్ మీదే ఉంచి బాగా ఉడికించాలి.

ఒక టేబుల్ స్పూన్ పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, బిర్యానీ మసాలా పొడి , రుచికి తగినంతా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి నానబెట్టిన బియ్యంలో వేపాలి.

ఇక ఇప్పుడు మూడు గ్లాస్ ల మంచి నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి 15 నిమిషాల పాటు ఉంచి దించేయాలి.