Home Tips: ఫ్యాన్ గాలి వేడిగా వస్తుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే.. క్షణాల్లో ఇళ్లంతా కూల్ కూల్!

Updated on: Mar 24, 2026 | 4:42 PM

ఎండలు మండిపోతున్న ఈ సమయంలో చాలామంది ఏసీల కోసం షోరూమ్‌లకు క్యూ కడుతున్నారు. అయితే ఏసీ కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరికొందరు కరెంటు బిల్లును ఆదా చేసేందుకు ఇంట్లో ఉన్న ఫ్యాన్ గాలితోనే సరిపెట్టుకుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే ఫ్యాన్ అన్ చేస్తే.. చల్లగాలికి బదులుగా వేడి గాలి వస్తోందని. కాబట్టి ఇప్పుడు మేం చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ ఫ్యాన్ నుండే వేగవంతమైన, చల్లని గాలిని మీరు పొందవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఫ్యాన్ రెక్కల శుభ్రత: చాలా మంది ఇళ్లలో ఫ్యాన్‌లు దుమ్ము పట్టిపోయి ఉంటాయి. ఇలా ఫ్యాన్ రెక్కలపై దుమ్ము పేరుకుపోయి ఉండడం వల్ల గాలిని లాక్కునే సామర్థ్యం తగ్గిపోతుంది. దుమ్ము వల్ల రెక్కల బరువు పెరిగి మోటారుపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి మీరు ఫ్యాన్ రెక్కలను శుభ్రం చేయడం ద్వారా ఫ్యాన్ వేగం పెరిగి చల్లగాలి వస్తుంది.

2 / 5
రెక్కల కోణం: ఫ్యాన్ రెక్కలు ఒక నిర్దిష్ట కోణంలో ఉంటేనే గాలిని రూము మొత్తం వ్యాపిస్తుంది. కాలక్రమేణా ఈ కోణం మారితే గాలి తక్కువగా వస్తుంది. రెక్కలను సరిగ్గా అమర్చడం ద్వారా గాలి ప్రవాహాన్ని మెరుగుపరచవచ్చు. కాబట్టి మీ ఫ్యాన్ ఉండే రెక్కలు సరైన కోణంలో ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోండి.

3 / 5
కండెన్సర్ మార్చడం: మీ ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంటే, లోపల ఉన్న కండెన్సర్ పాడై ఉండవచ్చు. తక్కువ ఖర్చుతో కొత్త కండెన్సర్ వేయించడం ద్వారా ఫ్యాన్ మళ్ళీ పాత వేగంతో తిరుగుతుంది. అప్పడూ గాలి కూడా వేగంగా వస్తుంది. ఇది రూమ్‌ మొత్తాన్ని చల్లబరుస్తుంది.

4 / 5
క్రాస్ వెంటిలేషన్ : ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్' అధ్యయనం ప్రకారం.. గదిలో గాలి వెళ్లే మార్గం సరిగ్గా లేకపోతే, ఫ్యాన్ గదిలోని వేడి గాలినే అటు ఇటు తిప్పుతుంది. గదిలోని కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచడం వల్ల 'క్రాస్ వెంటిలేషన్' జరిగి, గది ఉష్ణోగ్రత 2 నుండి 3 డిగ్రీల వరకు తగ్గుతుందని పరిశోధనలో తేలింది.

5 / 5
మీ గది చల్లగా ఉండాలంటే ఇదో అద్భుతమైన చిట్కా అనే చెప్పవచ్చు. ఫ్యాన్ కింద ఒక గిన్నెలో ఐస్ ముక్కలను ఉంచితే, గాలి ఆ మంచు గడ్డలకు తగిలి ఏసీ లాంటి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే రాత్రి సమయంలో బయటి గాలి లోపలికి వచ్చేలా కిటికీ దగ్గర ఫ్యాన్ ఉంచండి. గదిలో పేరుకుపోయిన వేడి గాలి బయటకు వెళ్లడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడటం ఉత్తమం మార్గం. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు వేసవిలోనూ గదిని చల్లగా ఉంచుకోవచ్చు.(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించడం లేదు)

Follow Us