బతుకమ్మలో పూల మధ్య పెట్టే గౌరమ్మ కథ తెలుసా?

Updated on: Oct 13, 2026 | 4:00 PM

తెలంగాణ ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. తొమ్మది రోజుల పాటు ఆడబిడ్డలు అందరూ కలిసి బతుకమ్మ ఆడుతుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి.. రామ రామ రామ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ.. రెండు చేతులతో చప్పట్లు కొడుతూ బతుమ్మ చుట్టూ తిరుగుతూ ఆట ఆడుతుంటారు.

1 / 5
అయితే అందరికీ బతుకమ్మ అంటే ఎక్కువ పూలు మాత్రమే గుర్తుకుస్తుంది. కానీ ఈ పండుగలో పసుపు గౌరమ్మ చాలా కీలకం. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బతుకమ్మలో పువ్వుల  మధ్య గౌరమ్మను ఎందుకు పెడుతారు. అసలు గౌరమ్మ కథ ఏంటో? కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసకుందాం.

2 / 5
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. బతుకమ్మ పండుగను ప్రకృతి పండుగ అని పిలుస్తుంటారు. ప్రకృతిలో లభించే అన్నిరకాల అన్ని రంగుల పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చుతారు. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు రంగు రంగుల పువ్వుల మధ్య పసుపు గౌరమ్మను ఎందు పెడతారు అని. దీని వెనక అనేక జానపద, పురాణ కథలు ఉన్నాయి. కాగా, మనం వాటి గురించి తెలుసుకుందాం.

3 / 5
బతుకమ్మను తొమ్మిది, పదహారు ఇలా వరసలను పెట్టి పేరుస్తుంటారు. అన్ని రంగుల పువ్వులతో ఒక గోపురంలా బతుకమ్మను పేరుస్తారు. ఇది ప్రకృతి , జీవితానికి సంకేతం. ఇక అందులో గౌరమ్మను పసుపుతో తయారు చేసి చిక్కుడు ఆకులో పెట్టి పెడుతుంటారు. అంటే గౌరీ దేవి ప్రకృతికి ఆత్మలాంటిది అని  అర్థం. ఇక పసుపుతో గౌరమ్మను చేసి పెట్టడం వెనకున్న కారణం, ఆడబిడ్డల పసుపు కుంకుమలకు ముత్తైదువతనానికి , సౌభ్యానికి గుర్తుగా పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మ పువ్వుల మధ్య పెట్టి, అమ్మవారిని పూజిస్తూ పాటలు పాడుతారు.

4 / 5
బతుకమ్మ అంటేనే గౌరమ్మ,  పార్వతీ దేవి పేరు గౌరమ్మ. అయితే ఆమెను బతుకునిమ్ము, నా బతుకును కాపాడమ్మ అని పిలుస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. అంతే కాకుండా దీని వెనక అనేక పురాణ కథలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే? ఒక కథనం ప్రకారం  చోళ రాజు ధర్మాంగదుడి కూతురు బతుకమ్మ, అనారోగ్యంతో చనిపోతే మళ్లీ బతికిందట. అందుకే ఆమె పేరు మీద ఆమెను బతికించిన గౌరమ్మను పూజిస్తారని చెబుతారని కొందరు చెబుతుంటారు.

5 / 5
మరో కథన ప్రకారం. సతీదేవి శివుడి కోసం తపస్సు చేసినప్పుడు గౌరీ రూపంలో వెలిసింది. ఆ గౌరమ్మను పువ్వులతో అలంకరించి పూజించడమే బతుకమ్మ అని కొందరు చెబుతుంటారు.  పువ్వులు లేకపోతే బతుకమ్మ లేదు, గౌరమ్మ లేకపోతే ఆ పువ్వులకు అర్థం లేదు. అందుకే మధ్యలో గౌరమ్మను పెట్టి, ఆడబిడ్డలంతా చుట్టూ తిరుగుతూ బతుకమ్మను బతుకునిమ్మని కోరుకుంటారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us