అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

Updated on: Jun 02, 2026 | 9:54 AM

Banana vs Dates: మీరు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. రాత్రంతా ఫాస్టింగ్ తర్వాత ఉదయం మన జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా మారుతుంది. ఈ టైమ్‌లో పండ్లు తినడం మంచిదే అయినా.. అన్ని పండ్లు ఖాళీ కడుపుకు సెట్ అవ్వవు. ముఖ్యంగా అరటిపండు వర్సెస్ ఖర్జూరం.. ఈ రెండింటిలో పరగడుపున ఏది తింటే మంచిదో తెలుసుకుందాం..

1 / 5
 ఉదయం పూట సరైన ఫుడ్ ముఖ్యం: చాలామంది రోజును కాఫీ, చాయ్‌లతో స్టార్ట్ చేస్తారు కానీ, ఉదయాన్నే పరగడుపున సరైన ఆహారం తింటేనే జీర్ణక్రియ బాగుంటుంది. రాత్రంతా కడుపు ఖాళీగా ఉండటం వల్ల ఉదయం పూట మన జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా మారుతుంది. అందుకే గ్యాస్, ఎసిడిటీ రాకుండా తేలికగా అరిగి, రోజంతా మంచి ఎనర్జీని ఇచ్చే పండ్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

2 / 5
అరటిపండుతో ఇన్‌స్టంట్ ఎనర్జీ: మనకు నిత్యం అందుబాటులో ఉండే అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, నాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది తిన్న వెంటనే బాడీకి సూపర్ ఎనర్జీ ఇస్తుంది, గుండెకు కూడా చాలా మంచిది. అయితే ఖాళీ కడుపుతో అరటిపండు తింటే బాడీలో మెగ్నీషియం బ్యాలెన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఒక్కసారిగా ఎనర్జీ పెరిగి.. ఆ తర్వాత అంతే వేగంగా నీరసం వచ్చేస్తుంది.

3 / 5
ఎసిడిటీ ఉన్నవాళ్లు : కడుపు కొంచెం సెన్సిటివ్‌గా ఉండేవాళ్లు ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అరటిపండును ఉదయాన్నే పరగడుపున తినడం కంటే.. కాస్త లేట్‌గా తినడం మంచిది. ఒకవేళ పొద్దున్నే తినాలనుకుంటే ఓట్స్, డ్రై ఫ్రూట్స్ లేదా గింజలతో కలిపి తింటే కడుపుకు ఎలాంటి నష్టం జరగదు.

4 / 5
ఖాళీ కడుపుకు రారాజు ఖర్జూరం: ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఖాళీ కడుపుతో తినడానికి ఖర్జూరం అత్యుత్తమమైన పండు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా సాగుతుంది. మలబద్ధకం సమస్య మటాష్ అవుతుంది. ఇది కడుపుకు చాలా తేలికగా ఉండటమే కాకుండా ఎసిడిటీ వచ్చే ఛాన్సే ఉండదు. రాత్రి పూట 2 లేదా 3 ఖర్జూరాలను నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే తింటే హెల్త్‌కి పండగే.

5 / 5
ఏది బెస్ట్: మొత్తంగా చూసుకుంటే, ఉదయాన్నే పరగడుపున తినడానికి అరటిపండు కంటే ఖర్జూరమే అన్ని విధాలా సేఫ్, బెస్ట్ ఆప్షన్. ఇది రోజంతా అలసట లేకుండా లాంగ్ లాస్టింగ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు అరటిపండుకు దూరంగా ఉండటం మంచిది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం ఈ రెండు పండ్లను తినేటప్పుడు క్వాంటిటీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Follow Us