Egg Puff: ఒవెన్ లేకుండా బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఇంట్లోనే ఈజీగా చేయండి ఇలా

Updated on: Nov 10, 2026 | 6:16 PM

సాయంత్రం వేళ వేడివేడి టీతో పాటు బేకరీలో దొరికే కరకరలాడే ఎగ్ పఫ్ తినడం ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. అయితే ఇంట్లో ఎగ్ పఫ్ చేయడానికి ఒవెన్ ఉండాలని, పఫ్ షీట్లు చేయడం చాలా కష్టమని చాలామంది ప్రయత్నించరు. కానీ ఇంట్లోనే ఉండే మైదా, బటర్ మరియు ఉడికించిన గుడ్లతో.. సాధారణ గ్యాస్ స్టవ్‌పైనే మందపాటి గిన్నెలో బేకరీ కంటే ఎంతో రుచిగా, పక్కా లేయర్లతో ఎగ్ పఫ్‌లను చాలా తేలికగా తయారుచేసుకోవచ్చు.

1 / 6
కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదాపిండి, ముద్దలా కలపడానికి సరిపడా కూలింగ్ వాటర్, 50 గ్రాముల బటర్, ఉడికించి పొట్టు తీసి నిలువుగా కట్ చేసిన  2 కోడిగుడ్లు, పావు టీస్పూన్ పంచదార, అర టీస్పూన్ ఉప్పు, పాలు లేదా కరిగించిన బటర్, స్పైసీ ఆనియన్ మసాలా స్టఫింగ్ కోసం: 2 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ తరుగు, అర టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ కారం పొడి, అర టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ చాట్ మసాలా పొడి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వంట నూనె, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, గుడ్లపై చల్లడానికి – కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, కారం

2 / 6
తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు మైదాపిండి, అర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పంచదార వేయాలి. ఇందులోకి ఫ్రిజ్‌లోని చల్లటి నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. చేత్తో బాగా ఒత్తుతూ 2 నిమిషాలు కలిపి.. తడిగుడ్డ కప్పి కనీసం 20 నిమిషాల పాటు నాననివ్వాలి. నానిన పిండిని పీటపై ఉంచి పొడి మైదా చల్లుతూ చపాతీ కర్రతో పల్చటి రెక్టాంగిల్  ఆకారంలో రోల్ చేసుకోవాలి. దీనిపై 50 గ్రాముల మెత్తని బటర్‌లో సగం బటర్‌ను చేత్తో సమంగా స్ప్రెడ్ చేయాలి. పైనుంచి కొద్దిగా పొడి మైదా చల్లాలి.

3 / 6
ఇప్పుడు రెండు అంచులను మధ్యలోకి మడిచి 'బుక్ ఫోల్డ్' చేయాలి. దీనిపై కొద్దిగా పొడిపిండి చల్లి ప్లేట్‌లో ఉంచి.. తడిగుడ్డ కప్పి డీప్ ఫ్రీజర్‌లో 20 నిమిషాలు ఉంచాలి. 20 నిమిషాల తర్వాత బయటకు తీసి.. మళ్లీ రెక్టాంగిల్‌గా రోల్ చేసి మిగిలిన బటర్ రాసి, పొడిపిండి చల్లి మళ్లీ ఫోల్డ్ చేసి మరో 20 నిమిషాలు డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా 2 నుండి 3 సార్లు చేస్తే పొరలు అద్భుతంగా వస్తాయి. పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయల తరుగు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.

4 / 6
ఇందులో అర టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. ఆపై చిటికెడు పసుపు, అర టీస్పూన్ కారం, అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ చాట్ మసాలా, సరిపడా ఉప్పు వేసి కలపాలి. చివరగా 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మసాలాలు మాడకుండా గుజ్జుగా దగ్గరపడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. డీప్ ఫ్రీజర్ నుండి గట్టిపడిన పఫ్ పేస్ట్రీ షీట్‌ను బయటకు తీసి చతురస్రాకారంలో రోల్ చేసి.. 4 సమాన చతురస్ర ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కో షీట్ ముక్క మధ్యలో కొద్దిగా తయారుచేసిన ఆనియన్ మసాలాను పరవాలి.

5 / 6
ఉడికించిన గుడ్డును సగానికి కోసి.. దానిపై కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి చల్లి, పచ్చసొన కిందకు ఉండేలా మసాలాపై బోర్లించాలి. షీట్ ఎదురెదురు అంచులను పైకి తెచ్చి మధ్యలో కలపాలి. పఫ్స్ పైభాగంలో మంచి రంగు రావడం కోసం పాలు లేదా కరిగించిన బటర్‌ను బ్రష్ చేయాలి. స్టవ్‌పై అడుగు మందపాటి పెద్ద గిన్నె లేదా కుక్కర్ పెట్టి మధ్యలో స్టాండ్ ఉంచి మూతపెట్టి మీడియం మంటపై 5 నిమిషాలు ప్రీ-హీట్ చేయాలి. ఒక అల్యూమినియం ప్లేట్‌కు నూనె రాసి.. తయారుచేసిన ఎగ్ పఫ్‌లను గ్యాప్ ఇస్తూ ఉంచాలి.

6 / 6
ప్రీ-హీట్ అయిన గిన్నెలో స్టాండ్‌పై ఈ ప్లేట్‌ను ఉంచి మూతపెట్టాలి. మీడియం మంటపై 30 నుండి 35 నిమిషాలు బేక్ చేయాలి. అడుగు భాగం ఎర్రగా కాలిన తర్వాత.. మూత తీసి పఫ్‌లను రెండో వైపుకు తిప్పి మంటను లో ఫ్లేమ్‌కి తగ్గించి మరో 5 నుండి 10 నిమిషాలు క్రిస్పీగా మారే వరకు కాల్చి తీసుకోవాలి. ఓవెన్ ఉన్నవారు 250°C వద్ద 20 నుండి 30 నిమిషాలు బేక్ చేసుకోవచ్చు. అంతే, నోరూరించే బేకరీ స్టైల్ 'క్రిస్పీ ఎగ్ పఫ్' సిద్ధం! కొద్దిగా చల్లారిన తర్వాత తింటుంటే బయట వేల పొరలతో కరకరలాడుతూ, లోపల ఘాటైన ఉల్లిపాయ మసాలా, గుడ్డు కమ్మదనంతో అచ్చం బేకరీలో కొన్నట్లే ఎంతో అద్భుతమైన రుచినిస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us