
మాడ్చిన నల్ల కారంపొడికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర కప్పు శనగపప్పు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, 15 వెల్లుల్లి రెబ్బలు , 15 కరివేపాకు ఆకులు, 100 గ్రాముల ఎండు మిర్చి తీసుకోవాలి ఎందుకంటే ఈ కారం వాటితోనే చేసేది కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

మాడ్చిన నల్ల కారం పొడి తయారి విధానం: ముందుగా మీరు ఒక పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి ఇవి కొద్దిగా మాడిన పర్లేదు. వీటితో పాటు జీలకర్రను కూడా వేయాలి వీటిని మీడియం మంటపైనే బాగా వేయించాలి. ఆ తరువాత మినప్పప్పు కూడా వేయించి చల్లారనివ్వాలి. అదే సమయంలో శనగపప్పు కూడా ఎర్రగా వేయించాలి.

మాడ్చిన నల్ల కారం పొడి తయారి విధానం స్టెప్ 2 : ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే మూడు మిరియాలు, వేసి వేయించాలి. 10 నిముషాల పాటు వీటిని వేయిస్తే చాలు. అలాగే వీటితో పాటు కరివేపాకు ఆకుల కూడా వేసి తడి వరకు వీటిని వేయించాలి. అలాగే, వెల్లుల్లిని కూడా బాగా వేయించుకుంటే ఈ పొడి నెలల పాటు నిల్వ ఉంటుంది.

మాడ్చిన నల్ల కారం పొడి తయారి విధానం స్టెప్ 3 : ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో కానీ, రోటిలో కానీ వీటిని నూరుకుంటే మంచి అది పొడిలాగా అవుతుంది. ఇంకా వీటిలో ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తే కారం కారంగా ఉంటుంది. ఇక చివరలోనాలుగు చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు కూడా వేసి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి.

ఇది తింటే ఒంటి నొప్పులు కూడా తగ్గుతాయి మాడ్చిన నల్ల కారం పొడి తింటే చట్నీ కూడా వద్దంటారు. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పొడిని తింటే తింటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశలకు కూడా ఇది మంచిగా సరిపోతుంది. ఇంకా దీనిలో వాడే జీలకర్ర కూడా తిన్న వెంటనే జీర్ణమయ్యేలా చేస్తుంది. ఈ పొడిలో కరివేపాకు కూడా వేస్తే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.