
ఉసిరికాయ పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు : మూడు కప్పుల ఉడికించిన అన్నం, 6 ఉసిరికాయలు, 4 పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. అయితే, మీరు ముందుగా బియ్యాన్ని నానాబెట్టుకోవాలి. వేడి వేడిగా చేస్తే మంచి రుచిగా ఉంటుంది

ఉసిరికాయ పులిహోర రెసిపీ తాలింపు కోసం కావాల్సినవి: ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , రెండు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు రెమ్మలు, కొద్దిగా ఇంగువ, అర కప్పు వేరుశెనగలు , 10 జీడిపప్పులు తీసుకోవాలి.

ఉసిరికాయ పులిహోర రెసిపీ తయారీ విధానం : ముందుగా అన్నాన్ని బాగా ఉడికించి పూర్తిగా బాగా చల్లారనివ్వాలి. ఇంకా దీనిలో నాలుగు ఉసిరికాయలను తీసుకుని బాగా కడిగి వీటి నుంచి గింజలు తీసి కొంచం తురుముకోవాలి. పాన్ లో ఆయిల్ వేసి నాలుగు వేరుశెనగలు, 10 జీడిపప్పులు వేయించి ఒక గిన్నెలో తీసుకోవాలి.

ఉసిరికాయ పులిహోర రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : నూనెలో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఇంకా జీలకర్ర కూడా వేసి బాగా వేయించాలి. ఇంకా నాలుగు ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, 5 కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇంకా దీనిలో పసుపు, ఉసిరికాయ ముక్కలు వేసి బాగా వేయించాలి.

ఉసిరికాయ పులిహోర రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : వీటిని బాగా వేయిస్తే ఉసిరికాయ టేస్ట్ కూడా బాగా తగ్గుతుంది. ఇంకా దీనిలో సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది చల్లారిన తరవాత అన్నంలో వేసి మంచిగా కలపాలి. ఇంకా చివర్లో దీనిలో వేయించిన వేరుశెనగలు, 10 జీడిపప్పులు వేసి ఇంకోసారి కలపాలి.