వేప నూనెతో అదిరిపోయే ప్రయోజనాలు.. నిగనిగలాడే చర్మంతో పాటు మరెన్నో..

Updated on: Jan 27, 2025 | 6:19 PM

పండుగలు, ప్రత్యేక రోజులలో ముఖం మెరిసిపోవాలని, అందరిలో అందంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం రకరకాల ఫేస్‌ క్రీములు, ప్యాక్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, ముఖంపై ట్యానింగ్ వల్ల ఏర్పడ్డ నలుపుదనాన్ని పోగొట్టుకోవటానికి ఒక అద్భుతమై ఆయిల్‌ ఉంది.. అది వేప నూనె.. దీనిని సరైన విధానంలో ముఖానికి అప్లై చేయడం వల్ల దీని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కొన్ని నిముషాల్లోనే మీకు మెరుపును ఇస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 5
వేప చెట్టు, వేప ఆకుల గురించి మనందరికీ తెలుసు. అయితే ప్రత్యేకంగా వేపనూనె కి కూడా ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. వేపలోని యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అన్నీ ఈ వేప నూనెలో కూడా ఉంటాయి. ఇవి ముఖం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వేపనూనెను రోజూ ముఖానికి రాసుకుంటే ఊహించని లాభాలు ఉన్నాయి.

2 / 5
వేపనూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది వయస్సు కనిపించకుండా చేస్తుంది. ముఖం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. దీన్ని అప్లై చేయడం వల్ల ముఖ్యంపై ముడతలు తగ్గుతాయి. అలాగే, ముఖం మృదువుగా, మెరిసేలా కనిపిస్తుంది.

3 / 5
వేపనూనెను రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం పొడిబారడం తగ్గుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, అందంగా మార్చుతుంది. ముఖానికి నూనె రాసి 15-20 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవచ్చు. వేపనూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. మీరు మీ ముఖాన్ని మెరిసేలా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ నూనెను వాడి చూడండి.

4 / 5
వేప నూనె జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. చుండ్రును కూడా తొలగిస్తుంది. మీరు రాత్రి పడుకునే ముందు వారానికి 3 సార్లు వేప నూనె రాయవచ్చు.
వేపనూనెలో ఉండే మూలకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతేకాకుండా ముఖంపై మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీరు మొటిమలను త్వరగా తొలగించాలనుకుంటే, ప్రతి రాత్రి మీ ముఖానికి అప్లై చేయండి.

వేప నూనె జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. చుండ్రును కూడా తొలగిస్తుంది. మీరు రాత్రి పడుకునే ముందు వారానికి 3 సార్లు వేప నూనె రాయవచ్చు. వేపనూనెలో ఉండే మూలకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతేకాకుండా ముఖంపై మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీరు మొటిమలను త్వరగా తొలగించాలనుకుంటే, ప్రతి రాత్రి మీ ముఖానికి అప్లై చేయండి.

5 / 5
మీ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు నూనెను ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని వేగంగా రిపేర్ చేస్తుంది. అలాగే, ముఖాన్ని కాంతివంతంగా, అందంగా మార్చుతుంది. వేప నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. ముఖంపై మొటిమలు పోవాలంటే వేపనూనెను బాగా పట్టించి మసాజ్ చేయాలి.