బయట కొనక్కర్లేదు.. ఇంట్లోనే కప్పు శనగ పిండి, రెండు బంగాళాదుంపలతో పేదోళ్ళ సూపర్ స్నాక్!

Updated on: Jun 24, 2026 | 2:55 PM

వానల్లో ఓ వైపు వేడి వేడి టీతో తింటే ఈ పేదోళ్ళ రుచికరమైన స్నాక్ తింటే అబ్బబ్బా భలేగా ఉంటుంది ఇవి బయటకు కరకరలాడుతూ, లోపల మాత్రం మెత్త మెత్తగా ఉంటాయి ఈ పకోడీలను మీ ఇంట్లోనే ఈజీగాచేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు లాగిస్తారు

1 / 5

బంగాళాదుంప పకోడికి కావలసిన పదార్థాలు: రెండు బంగాళాదుంపలు,  ఒక కప్పు శనగపిండి , రెండు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి, 
ఒక ఉల్లిపాయ , నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా కరివేపాకు , రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం , కొద్దిగా పసుపు , రుచికి సరిపడా ఉప్పు , అర టీ స్పూన్  వాము , కొద్దిగా బేకింగ్ సోడా, 
 నూనెను కూడా తీసుకోవాలి.

బంగాళాదుంప పకోడికి కావలసిన పదార్థాలు: రెండు బంగాళాదుంపలు, ఒక కప్పు శనగపిండి , రెండు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి, ఒక ఉల్లిపాయ , నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా కరివేపాకు , రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం , కొద్దిగా పసుపు , రుచికి సరిపడా ఉప్పు , అర టీ స్పూన్ వాము , కొద్దిగా బేకింగ్ సోడా, నూనెను కూడా తీసుకోవాలి.

2 / 5
బంగాళాదుంప పకోడి తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపలను తీసుకుని వాటిని బాగా ఉడికించి  పొట్టు తీసి ఆ తరువాత వీటిని బాగా పప్పు గుత్తితో మెదపాలి. ఇంకా కొన్ని ముక్కలను తీసుకుని చిన్నగా  ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద గిన్నెలో ఈ బంగాళాదుంపలు కొంచం తరిగిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఇంకా నాలుగు కరివేపాకు, కొత్తిమీరను కూడా  వేసుకోవాలి.

3 / 5
బంగాళాదుంప పకోడి తయారీ విధానం స్టెప్  1 : ఇప్పుడు దీనిలో కొద్దిగా శనగపిండి, కప్పు బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్  కారం, కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  కొద్దిగా వాము, ఉప్పు కూడా వేసి దీనిలో  కలపాలి. ఇలా చేసిన తరవాత ఈ  మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా నీళ్లు కొద్దిగా పోసి పిండి మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి.

4 / 5

బంగాళాదుంప పకోడి తయారీ విధానం స్టెప్  2 : బంగాళాదుంపల్లో కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి వీటిని నీళ్లు అవసరమే ఉండదు. ఇంకా స్టవ్ పాన్ పెట్టి ఆయిల్ పోసి మీడియం మంటపై దీనిని బాగా  వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని  ఉండలు ఉండలుగా చేత్తో తీసుకుని నూనెలో కొద్దీ కొద్దిగా పకోడీలా వేయాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు బాగా కాల్చుకోవాలి.

5 / 5
కరకరలాడే వరకు ఈ పకోడీలను వేయించాలి: ఒక వైపు బాగా కాలిన తరవాత రెండు వైపు కూడా వీటిని బాగా కాల్చుకోవాలి. ఇంకా వీటికి ఎక్స్ట్రా నూనె ఉంటే దానిని తీసేయాలి. అలాగే వేయించిన పకోడీలను ఒక టిష్యూ పేపర్‌పై వేస్తే అంత ఎక్కువ నూనె అనిపించదు. టమాటా సాస్, పుదీనా చట్నీతో తింటే సూపర్ ఉంటుంది.

Follow Us