
ప్రస్తుత జీవనశైలిలో ఎంతో మంది సమయానికి తినకపోవడం ఇంకా బయటి ఫుడ్ తినడం వలన గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఇంకొందరు ప్రతి చిన్న దానికి మెడిసిన్స్ వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి, వీటి కన్నా నేచురల్ గా తగ్గించుకోవడం మంచిది. ఏం చేయాలో ఇక్కడ చూద్దాం..

మీరు వాడే మెడిసిన్స్ కు సైడ్ ఎఫెక్ట్స్ పక్కా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ టాబ్లెట్ కన్నా చాలా స్పీడ్ గా ఇది పని చేస్తుంది. ఈ నేచురల్ డ్రింక్ అంత పవర్ఫుల్. మరి, ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి? దీని వలన కడుపుకి ఎంత మేలు చేస్తుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఇటీవలే కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నిజం చెప్పాలంటే తిన్న ఆహారమే జీర్ణమవ్వడానికి ఇబ్బందులు వస్తాయి. ఇంకా కొందరికి తిన్న ఫుడ్ చాలా స్లో గా జీర్ణమవుతుంది. మరి, కొందరికైతే అసలు జీర్ణం కాదు. దీని వలన జీర్ణ సమస్యలు ఇంకా పెరుగుతాయి.

పావు టేబుల్ స్పూన్ వాములో కొంచం ఉప్పు వేసి దానిని నములుతూ ఉంటే ఇది తగ్గుతుంది. అలా కుదరకపోతే గోరువెచ్చని నీటిలో వాము వేసి దీనిని కలిపి తినవచ్చు. ఇంకా వామును కూడా వేసి మరిగించాలి. అలాగే నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని తాగాలి. అయితే, మీరు దీనిని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)