60 ఏళ్ల వయస్సులో స్కూల్ బ్యాగ్ పట్టుకున్న అమ్మమ్మలు.. మహారాష్ట్రలో అద్భుత పాఠశాల!

Edited By:

Updated on: Apr 05, 2026 | 12:08 PM

శివాజీని అమితంగా ఆరాధించే మహారాష్ట్రలో ఓరోజు ఆయన జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కొందరు ఉపన్యాసాలివ్వడం చూసి తామా అఇలా మాట్లాడగల్గితే, చూసి చదవగల్గితే బాగుండు కదా అన్న ప్రస్తావన తెచ్చారు ఫంగానే గ్రామీణ మహిళలు. ఆ మాట యోగేంద్ర బంగార్ అనే వ్యక్తి మనసులో నాటుకుంది.

1 / 5

చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే వయస్సు అసలు సమస్యే కాదు. అందుకే అక్కడ 60ల్లో అమ్మమ్మలంతా పలకా, బలపం పట్టుకుని ప్రతీరోజూ మధ్యాహ్నం బడికెళ్తున్నారు. అదీ చిన్ననాట విద్యార్థులు స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్లినట్టుగా.. పింక్ చీరల్లో మెరుస్తూ ఏబీసీలు నేర్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని ఫంగానేలో యోగేంద్ర బంగార్ అనే ఉపాధ్యాయుడి చొరవతో అజీబాయిచీ శాల అనే పాఠశాల ఒకటి ప్రారంభమైంది. ఈ పాఠశాలలో 69 నుంచి 90ల వరకూ ముదిమి వృద్ధులే విద్యార్థులు. చిన్నప్పుడు కోల్పోయిన అవకాశాన్ని ఇప్పుడు అందిపుచ్చుకుంటున్నారు.ఓ పక్క చిన్న చిన్న పిల్లలు బడికెళ్లి చదవడం, రాయడం, పాటలు పాడటం, ఆటాలాడటం చేస్తుంటే... మరోపక్క 60ల పైన ఉన్న బామ్మలంతా కూడా ఒకే పింక్ చీరల్లో మెరిసిపోతూ ఆ చిన్నారుల తరహాలోనే చేస్తుంటే ఏమనిపిస్తుంది..? చూడముచ్చటగా ఉంటుంది. ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఆజీబాయిచీ శాల అనే స్కూల్ ఇప్పుడు వృద్ధ గ్రామీణ మహిళా చైతన్యానికి ఓ ప్రతీక. చదువుకు వయసుతో సంబంధం లేదని ప్రకటించే పతాక.

2 / 5
మహారాష్ట్ర థానే జిల్లాలో ఉంది ఈ ఫంగానే గ్రామం. ఈ పాఠశాల ఏర్పాటుతో దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. జీవితమంతా పొలాల్లో పనిచేస్తూ, ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం వంటి కుటుంబ బాధ్యతలు చూస్తూ పెరిగిన మహిళలకు బళ్లకు వెళ్లే అవకాశమే లేకుండేది. అలాంటివారిలో ఆసక్తి ఉన్నవారందరినీ ఒక్కచోటకు చేర్చి వయోజన విద్యనందిస్తోంది ఆజీబాయిచీ శాల.
2016, మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ పాఠశాల ప్రారంభమైంది. మొట్టమొదటి బ్యాచులోనే 28 మంది అమ్మమ్మలు విద్యార్థినులుగా జాయిన్ అయ్యారు. ప్రతీరోజూ మధ్యాహ్నం ఇంటి పనులు పూర్తి చేసుకుని పింక్ చీరలు ధరించి, పలకా, బలపం, చాక్ పీసులు, బ్యాగులతో చిన్నపిల్లల్లా మారి వీరు స్కూల్ కు వచ్చే మురిపెం ముచ్చటగొలిపేది.మరాఠీలో చదువుతో పాటు, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం, పాటలు పాడటం, చిత్రలేఖనం వంటివి నేర్పుతారు ఆజీబాయిచీ శాలలో.  స్కూల్ లో మొక్కల పెంపకంలో కూడా సాయమందిస్తారు.

మహారాష్ట్ర థానే జిల్లాలో ఉంది ఈ ఫంగానే గ్రామం. ఈ పాఠశాల ఏర్పాటుతో దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. జీవితమంతా పొలాల్లో పనిచేస్తూ, ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం వంటి కుటుంబ బాధ్యతలు చూస్తూ పెరిగిన మహిళలకు బళ్లకు వెళ్లే అవకాశమే లేకుండేది. అలాంటివారిలో ఆసక్తి ఉన్నవారందరినీ ఒక్కచోటకు చేర్చి వయోజన విద్యనందిస్తోంది ఆజీబాయిచీ శాల. 2016, మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ పాఠశాల ప్రారంభమైంది. మొట్టమొదటి బ్యాచులోనే 28 మంది అమ్మమ్మలు విద్యార్థినులుగా జాయిన్ అయ్యారు. ప్రతీరోజూ మధ్యాహ్నం ఇంటి పనులు పూర్తి చేసుకుని పింక్ చీరలు ధరించి, పలకా, బలపం, చాక్ పీసులు, బ్యాగులతో చిన్నపిల్లల్లా మారి వీరు స్కూల్ కు వచ్చే మురిపెం ముచ్చటగొలిపేది.మరాఠీలో చదువుతో పాటు, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం, పాటలు పాడటం, చిత్రలేఖనం వంటివి నేర్పుతారు ఆజీబాయిచీ శాలలో. స్కూల్ లో మొక్కల పెంపకంలో కూడా సాయమందిస్తారు.

3 / 5

లక్ష్యం చాలా చిన్నదే! చిన్నప్పుడు కోల్పోయిన చదువును ఇప్పుడు నేర్చుకోవడమే ఆజీబాయిచీ శాల లక్ష్యం. ఈ పాఠశాలలో చదివే చాలామంది మహిళలకు ఇది చదువు మాత్రమే కాదు.. ఇప్పుడు చదువు తెచ్చిపెట్టిన ఆత్మగౌరవం కూడా. ఏ అవసరం పడ్డా వేలిముద్రలే వేసే మహిళలంతా ఇప్పుడు తమ పేర్లతో సంతకాలు చేస్తున్నారు.  పాఠాలను గడగడా చదువగల్గుతున్నారు. మనవలు, మనవరాళ్ల చదువుల్లో దగ్గర కూర్చోబెట్టుకుని సాయమందిస్తున్నారు. సాధారణంగా మారాం చేస్తున్న పిల్లలను బళ్లకు తీసుకుపోయే పెద్దవాళ్లను చూసి ఉంటాం. కానీ, అందుకు పూర్తిగా రివర్స్ సీన్స్ మనం ఫంగానే ఆజీబాయిచీ శాల వద్ద చూస్తాం. కొందరు చేతనైనవాళ్లు తమంతట తామే స్కూల్ కు వస్తుంటే.. మరికొందరు చేతకాని పెద్దమనుషులను వాళ్ల మనవలో, కొడుకులో, కూతుళ్లో తీసుకుని వచ్చే దృశ్యాలు ఒక కొత్త అనుభూతినిచ్చేవి.

4 / 5
ఆజీబాయిచీ శాల కేవలం చదువు నేర్పడం వరకే పరిమితం కాలేదు. ఇక్కడి గ్రామీణ మహిళల జీవితాల్నే సమూలంగా మార్చేసింది. విద్యావంతుల్ని చేసి ఇక్కడి సమాజాన్ని మేల్కోల్పే దిశగా అడుగులు వేయిస్తోంది. ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్య ఇక్కడి వృద్ధ మహిళలకు ఆత్మవిశ్వాసాన్నీ, స్వతంత్రతను, జీవితాలకు కొత్త అర్థాన్నిచ్చింది. హైజీన్ న్యూట్రిషన్ ఫుడ్ నుంచి మొదలుకుంటే సామాజిక అంశాల పట్ల అవగాహన, బ్యాంకింగ్ వంటి ఎన్నో విషయాల్లో ఇప్పుడు వీరి కాన్ఫిడెన్స్ లెవల్సే మారిపోయాయి. దీంతో ఇక్కడి వృద్ధ మహిళలు స్వయం సమర్థులుగా మారిపోవడం ఇక్కడ ఆజీబాయిచీ శాల తీసుకొచ్చిన ఓ గొప్ప మార్పు.

5 / 5
ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే! నేర్చుకోవడానికి వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదనే సందేశాన్నిచ్చే పాఠశాల ఆజీబాయిచీ శాల. చిన్నప్పుడు చదువుకోలేనివాళ్లు ఎప్పుడైనా చదువుకునే అవకాశాన్ని కల్పించిన స్కూల్ ఇది. వయస్సుతో పాటే ఆకాంక్షలకు ఫుల్ స్టాప్ పెట్టకుండా.. కొత్తగా ఎప్పుడైనా మొదలుపెట్టి ధైర్యాన్నిచ్చే ఒక మార్పును చూపించింది ఈ బడి. విద్య అంటే కేవలం డిగ్రీలు, ఉపాధి, ఉద్యోగాలు మాత్రమే కాదు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఎప్పటికైనా నేర్చుకోవచ్చనే ఆనందం అనే సందేశాన్నిచ్చి ఇప్పుడు దేశంలోనే ఆజీబాయిచీ శాల ప్రత్యేకతను సంపాదించుకుంది.

Follow Us