
కిటికీలు, తలుపులు మూసి ఉంచడం: వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే చాలు ప్రతి ఇంట్లో దోమల బెడద స్టార్ట్ అవుతుంది. దీనివల్ల రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. అగే డెంగు, మలేరియా వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రేనీ సీజన్‌లో దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు సాయంత్రం అవ్వగానే ఇంటి కిటికీలు, తలుపులు మూసేయండి. లేదా కిటీలకు , డోర్‌లకు దోమల తెరలను ఏర్పాటు చేసుకోండి.

ఇంటి పరిసరాల పరిశుభ్రత: వర్షాలు పడడం కారణంగా ఇంటి చుట్టు నీరు నిలుస్తాయి. వాటిలో దోమలు గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటాయిం. కాబట్టి మీ ఇల్లు, ఇంటి చుట్టుపక్కల, నీటి మడుగులు, దుమ్ము, ధూళి, పాత సామాన్లు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

సువాసనగల మొక్కలు: దోమలను నివారించడానికి ఇంటి లోపల, బయట ఘాటైన వాసన వచ్చే మొక్కలను పెంచండి. ఉదాహరణకు: తులసి, బంతి పూల మొక్కలు. వీటి వాసనకు దోమలు దరిచేరవు. అలాగే సహజ పద్ధతిలో తయారు చేసిన వెల్లుల్లి స్ప్రేని ఇంటి ఆవరణలో చల్లుకోండి వెల్లుల్లిలోని ఘాటైన వాసన కారణంగా దోమలు అస్సలు రావు.

నిమ్మకాయ - లవంగాలు: ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి, దాని మధ్యలో లవంగాలను గుచ్చి ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఈ రెండింటి కలయిక వల్ల వచ్చే ఘాటైన వాసనకు దోమలు పారిపోతాయి. అలాగే లావెండర్ మొక్కను ఇంట్లో పెంచుకోండి. ఇది దోమలను దూరం చేయడంలో బాగా సహాయపడుతుంది.

వేప నూనె: వేప నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఈ వేప నూనెను కొబ్బరి నూనెతో కలిపి శరీరానికి రాసుకుంటే దోమలు కుట్టవు. అలాగే పుదీనా ఉన్న మౌత్ వాష్‌ను నీటితో కలిపి స్ప్రే చేయడం ద్వారా దోమలను అరికట్టవచ్చు. లేదా పుదీనా ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ, వాసనకు దోమలు పారిపోతాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా వర్షాకాలంలో దొమల బెడద నుంచి తప్పించుకోవచ్చ.