
గోరువెచ్చని నీరు: ఉదయం నిద్రలేవగానే మొబైల్ చూడటం శరీరానికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. దానికి బదులుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని చిన్న గుటకలతో ప్రశాంతంగా తాగాలి. రాత్రంతా నిద్రలో శరీరం రిపేర్ మోడ్‌లో ఉండి డీహైడ్రేట్ అవుతుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల అవయవాలన్నీ యాక్టివేట్ అయి జీవక్రియలు సక్రమంగా మొదలవుతాయి.

సహజ సూర్యకాంతి : ఉదయం 6 నుండి 7 గంటల సమయంలో బయటకు వచ్చి కేవలం 5 నుండి 10 నిమిషాలు లేత సూర్యకాంతిలో గడపాలి. సూర్యకాంతి శరీరంపై పడటం వల్ల జీవగడియారం రీసెట్ అవుతుంది. ఇది సెరోటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేసి రోజంతా మానసిక ఉల్లాసాన్ని, రాత్రివేళ గాఢమైన నిద్రను అందిస్తుంది.

'మా' ఫిలాసఫీ: జపాన్‌లో 'మా' అంటే రెండు పనుల మధ్య ఉండే అర్థవంతమైన నిశ్శబ్ద విరామం. నిద్రలేచిన వెంటనే కాఫీ తాగకుండా, కనీసం 30 నుండి 45 నిమిషాల సమయం ఇచ్చి ఆ తర్వాత తాగాలి. దీనివల్ల శరీర సహజ శక్తి నిలిచి ఉంటుంది, రోజంతా ఉన్నట్టుండి నీరసపడిపోయే సమస్య రాదు.

జెంటిల్ వాకింగ్: తీవ్రమైన అలసట కలిగించే వర్కవుట్ల కంటే ఉదయం పూట ఎటువంటి స్టాప్‌వాచ్, హెడ్‌ఫోన్స్ లేకుండా ప్రశాంతంగా 15 నుండి 20 నిమిషాలు నడవాలి. ప్రకృతిని గమనిస్తూ చేసే ఈ తేలికపాటి నడక శరీరానికి తాజా ఆక్సిజన్‌ను అందించి హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.

సేజాకు– అంతర్గత నిశ్శబ్దం: రోజును ప్రారంభించే ముందు కనీసం 5 నిమిషాల పాటు ఎటువంటి పరధ్యానం లేకుండా నిశ్శబ్దంగా కూర్చోవడమే 'సేజాకు'. కళ్లు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టి మనసును ప్రశాంతపరుచుకోవాలి. ఈ అలవాటు రోజువారీ ఆందోళనలను దూరం చేస్తుంది. బరువు తగ్గడం అనేది కేవలం క్యాలరీల లెక్క మాత్రమే కాదు, మన శరీరంతో మనం ఎంత ప్రేమగా ఉంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. రేపటి నుంచే ఈ చిన్న మార్పులు ప్రారంభించి ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి!