Screen Time: పిల్లలు ఫోన్‌ వదలట్లేదా.. తగ్గించకపోతే.. ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే.. జాగ్రత్త మరీ!

Updated on: Jun 03, 2026 | 7:14 PM

ప్రస్తుతం వేసవి సెలవులు నడుస్తున్నాయి, స్కూలుకు వెళ్లాలనే టెన్షన్ లేదు దీంతో చాలా మంది పిల్లలు రోజంతా మొబైల్స్ లేదా టీవీలకే అతుక్కుపోతున్నారు. అయితే, రోజంతా ఇలా ఫోన్‌లు, టీవీలు చూడటం వల్ల పిల్లల ఆరోగ్యంపై ఎంతటి చెడు ప్రభావం పడుతుందో మీకు తెలుసా? ఇటీవల నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు 6 గంటల కంటే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల పిల్లల్లో హై బ్లడ్ ప్రెషర్ సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. కాబట్టి పిల్లలు ఫోన్‌ వాడకం తగ్గించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
టైమ్ షెడ్యూల్: వేసవి సెలవుల్లో పిల్లలను స్క్రీన్ టైమ్‌కు పూర్తిగా దూరం పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, వారి స్క్రీన్ టైమ్‌ను ఖచ్చితంగా తగ్గించవచ్చు. దీని కోసం మీరు ఫోన్ వాడేందుకు ఒక టైమ్ లిమిట్ సెట్ చేయాలి. ఆ నిర్ణీత సమయంలో మాత్రమే పిల్లలను మొబైల్ లేదా టీవీ చూడనివ్వాలి. దీనివల్ల పిల్లలు నెమ్మదిగా ఆ సమయానికే అలవాటు పడతారు.

2 / 5
అవుట్‌డోర్ యాక్టివిటీస్‌: పిల్లలు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే.. టీవీనో, ఫోనో చూడాలి అనిపిస్తుంది. కాబట్టి సాయంత్రం వేళల్లో వారిని కాసేపు బయటకు తీసుకెళ్లి శారీరక శ్రమ ఉండే పనులు చేయించడం మంచిది. ఉదాహరణకు, సాయంత్రం పూట పార్కుకు తీసుకెళ్లడం, సైక్లింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్ లేదా మరేదైనా ఆటలు ఆడేలా ప్రోత్సహించడం చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలను యాక్టీవ్‌గా ఉంచవచ్చు. స్ర్కీన్‌కు దూరంగా ఉంచవచ్చు.

3 / 5
క్రియేటివ్ పనుల్లో బిజీగా ఉంచండి: స్క్రీన్ టైమ్ తగ్గించాలంటే పిల్లలను వేరే పనుల్లో బిజీగా ఉంచడం చాలా ముఖ్యం. ఇందుకోసం డ్రాయింగ్, పెయింటింగ్, కథల పుస్తకాలు చదవడం, క్రాఫ్ట్స్ చేయడం, మ్యూజిక్ నేర్చుకోవడం లేదా పజిల్స్ సాల్వ్ చేయడం వంటి యాక్టివిటీస్ చేయించవచ్చు. ఇలా చేయడం ద్వారా స్క్రీన్ టైమ్‌ను తగ్గించడమే కాకుండా, పిల్లల ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంపొందిస్తాయి.

4 / 5
కుటుంబంతో కలిసి సమయం గడపండి: తల్లిదండ్రులు పిల్లలతో కలిసి బోర్డ్ గేమ్స్ వంటివి ఆడినా, వారితో మాట్లాడినా లేదా ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ చేసినా పిల్లలు టీవీ, మొబైల్‌లకు దూరంగా ఉండటమే కాకుండా ఫ్యామిలీకి దగ్గరగా ఉండేందుకు ట్రై చేస్తారు. కుటుంబంతో గడిపే సమయం పిల్లల మానసిక, భావోద్వేగ ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది.

5 / 5
మీరే ఒక రోల్ మోడల్‌గా : పిల్లలు తరచుగా తమ తల్లిదండ్రుల అలవాట్లను చూసే నేర్చుకుంటారు. ఇంట్లోని పెద్దలే ఎప్పుడూ మొబైల్స్‌ చూస్తూ ఉండిపోతే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి, తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు మొబైల్‌ను వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా టీవీ, మొబైల్స్ వైపు తక్కువ శ్రద్ధ చూపుతారు.

Follow Us