Men Hygiene Mistakes: మగవారు లో దుస్తులు వాడటం లో చేసే తప్పులు.. ఇలా చేస్తే.. అలా షెడ్డుకే

Updated on: Jun 22, 2026 | 4:29 PM

పురుషులు బాహ్య సౌందర్యానికి, ఫ్యాషన్‌కు ఇచ్చే ప్రాధాన్యత అంతర్గత ఆరోగ్యానికి ఇవ్వరు. ముఖ్యంగా అండర్‌వేర్ ఎంపికలో మరియు దానిని ధరించే విధానంలో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు పురుషుల ప్రైవేట్ భాగాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆ 5 ప్రధాన తప్పులు ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

1 / 5
సాధారణంగా చాలా మంది పురుషులు తాము బయటకు వేసుకునే షర్టులు, ప్యాంట్ల విషయంలో ఎంతో శ్రద్ధ పెడుతుంటారు. కానీ, లోపల వేసుకునే అండర్‌వేర్ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. "బయటకు కనిపించని దాని గురించి అంతగా ఆలోచించడం ఎందుకు?" అనే ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఈ చిన్న నిర్లక్ష్యమే పురుషుల ప్రైవేట్ భాగాల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. 

2 / 5
మొదటి తప్పు, ఇంట్లో ఉన్నప్పుడు లేదా పడుకునేటప్పుడు కూడా అండర్‌వేర్ అస్సలు తీయకపోవడం. రాత్రి పడుకునే సమయంలో శరీరానికి, ముఖ్యంగా ప్రైవేట్ భాగాలకు గాలి ఆడటం చాలా ముఖ్యం. ఆ సమయంలో అండర్‌వేర్ లేకుండా పడుకోవడం వల్ల ఫ్రీనెస్ లభిస్తుంది. రెండవ తప్పు, వీ-కట్ అండర్‌వేర్లను ఎక్కువగా వాడటం. ఇవి ప్రైవేట్ భాగాలను మరీ టైట్‌గా పట్టి ఉంచడం వల్ల ఆ ప్రాంతంలో వేడి పెరిగిపోతుంది. దీనివల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్, వాటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికి బదులుగా ట్రంక్స్ (Trunks) రకం అండర్‌వేర్లను వాడటం ఎంతో సురక్షితం.

3 / 5
మూడవ తప్పు, జిమ్, రన్నింగ్ లేదా కాలేజీకి వెళ్లి వచ్చిన తర్వాత చెమట పట్టిన అండర్‌వేర్లను అలాగే చాలా సేపు ఉంచుకోవడం. చెమట వల్ల ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్లు, అలర్జీలు మరియు దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నాలుగవ తప్పు, ఎప్పుడూ నలుపు లేదా ముదురు రంగు అండర్‌వేర్లను ఎంచుకోవడం. ముదురు రంగులు బయట నుండి వచ్చే వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. అందువల్ల వైట్ లేదా లైట్ కలర్ అండర్‌వేర్లను వాడటం వల్ల ఆ ప్రాంతం కాస్త చల్లగా ఉంటుంది.

4 / 5
ఐదవ మరియు అత్యంత ప్రమాదకరమైన తప్పు, ఒకే అండర్‌వేర్‌ను సంవత్సరాల తరబడి వాడటం లేదా మరకలు పడిన వాటిని ధరించడం. ఏదైనా అండర్‌వేర్ యొక్క గరిష్ట జీవితకాలం ఒక సంవత్సరం మాత్రమే. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ పాడైపోయి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది.

5 / 5
ఒకసారి వేసుకున్న అండర్‌వేర్‌ను ఒక్క రోజు కంటే ఎక్కువ కాలం అస్సలు వాడకూడదు. అంటే రోజుకు ఒకసారి ఖచ్చితంగా ఉతికిన ఫ్రెష్ అండర్‌వేర్ ధరించాలి. చెమట పట్టిన అండర్‌వేర్‌ను అలాగే ఎక్కువసేపు ఉంచడం వల్ల ఆ ప్రాంతంలో తేమ చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్లు (తామర, దురద) మరియు బ్యాక్టీరియా త్వరగా వ్యాపిస్తాయి. కాబట్టి, పురుషులు తమ అంతర్గత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 5 తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలి.

Follow Us