కరోనా కాలం.. ఆన్ లైన్ పేమెంట్ స్కామ్స్.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన సీబీఐ

ఆన్ లైన్ అడ్వాన్స్ పేమెంట్ స్కామ్స్ పై సీబీఐ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఈ కరోనా తరుణంలో ఫేక్ హ్యాండ్ శానిటైజర్లను తయారీ కోసం కొందరు క్రిమినల్స్ మీథనాల్ ని వినియోగిస్తున్నారని..

కరోనా కాలం.. ఆన్ లైన్ పేమెంట్ స్కామ్స్.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన సీబీఐ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 15, 2020 | 6:32 PM

ఆన్ లైన్ అడ్వాన్స్ పేమెంట్ స్కామ్స్ పై సీబీఐ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఈ కరోనా తరుణంలో ఫేక్ హ్యాండ్ శానిటైజర్లను తయారీ కోసం కొందరు క్రిమినల్స్ మీథనాల్ ని వినియోగిస్తున్నారని, హ్యాండ్ శానిటైజర్ల కొరతను అవకాశంగా తీసుకుని ఆన్ లైన్ అడ్వాన్స్ పేమెంట్ చేయవలసిందిగా  అవసరమైనవారిని కోరుతున్నారని సీబీఐ గుర్తించింది.  పీపీఈ ఇతర కిట్ల విషయంలోనూ వీరు ఇదే ఛాన్స్ గా మోసాలకు పాల్పడుతున్నారని తెలియవచ్చింది. అయితే వినియోగదారులు తాము చెల్లింపులు జరిపిన తరువాత ఈ కేటుగాళ్లు ఎలాంటి వస్తువులనూ డెలివరీ చేయడంలేదు. నకిలీ హ్యాండ్ శానిటైజర్ల వల్ల ఫలితం లేకపోగా కేటుగాళ్లు పత్తా లేకుండా పోతున్నారు. నిజానికి మీథనాల్ చాలా హానికరమైనది. మనుషుల శరీరాలకు ప్రమాదకరమైనది కూడా. అందువల్లే ఈ విషయాన్ని  గుర్తించి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అలెర్ట్ గా ఉండాలని, ఆన్ లైన్ పేమెంట్ స్కాములకు కళ్లెం వేయాలని ఈ  దర్యాప్తు సంస్థ సూచిస్తోంది.