పాత రూ.500 ఇస్తే 50 వేలు.. కాయ్ రాజా కాయ్!

హైదరాబాద్: డిమోనిటైజేషన్‌కు ముందు చలామణిలో ఉన్న పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్‌కు చెందిన ఒక నోటు ఇస్తే 50 వేలు వస్తాయంటూ ఓ వ్యక్తిని నమ్మించి ముఠా ఏకంగా 12 లక్షలు కాజేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దందాను సైదాబాద్ పోలీసులు 48 గంటల్లో ఛేదించి.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు.. వారి దగ్గర నుంచి 12 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నగరానికి చెందిన రాజ్‌కుమార్‌ బగాడియా పుత్లిబౌలిలోని రంగ్‌మహల్‌ […]

పాత రూ.500 ఇస్తే 50 వేలు.. కాయ్ రాజా కాయ్!
Follow us

|

Updated on: Aug 25, 2019 | 10:24 AM

హైదరాబాద్: డిమోనిటైజేషన్‌కు ముందు చలామణిలో ఉన్న పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్‌కు చెందిన ఒక నోటు ఇస్తే 50 వేలు వస్తాయంటూ ఓ వ్యక్తిని నమ్మించి ముఠా ఏకంగా 12 లక్షలు కాజేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దందాను సైదాబాద్ పోలీసులు 48 గంటల్లో ఛేదించి.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు.. వారి దగ్గర నుంచి 12 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నగరానికి చెందిన రాజ్‌కుమార్‌ బగాడియా పుత్లిబౌలిలోని రంగ్‌మహల్‌ రోడ్‌లో శ్రీ సంతోషి ఫిల్లింగ్‌ స్టేషన్‌ పేరుతో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రకాష్‌నగర్‌కు చెందిన సంబరం రాజేష్‌ పని చేస్తున్నాడు. అతనికి అబేద్‌ మొహియుద్దీన్, షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌‌లు స్నేహితులు. బగాడియాకు డబ్బాశ ఎక్కువని గ్రహించిన వీళ్ళ ముగ్గురు ఓ పధకం రచించారు. ఈ త్రయం అనుకున్నట్లుగానే బగాడియా వీక్‌నెస్‌పై కొట్టి.. తేలిగ్గా డబ్బులు సంపాదించే మార్గం ఉందంటూ నమ్మిస్తారు.

2002లో ముద్రితమైన పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్‌కు ఇప్పుడు మంచి డిమాండ్‌ వచ్చిందని, ఆ కరెన్సీ దొరికితే ఒక్కో నోటుకు రూ.50 వేలు ఇవ్వడానికి కొందరు సిద్ధంగా ఉన్నట్లు బగాడియాతో చెప్పారు. అంతేకాకుండా సైదాబాద్‌లోని ఓ వ్యక్తి వద్ద 2 కోట్ల పాత కరెన్సీ ఉందని.. అతని అడ్వాన్స్ ఇస్తే ఆ నోట్లు ఇచ్చేస్తాడని చెబుతారు. ఇక డబ్బాశ ఉన్న బగాడియా వాళ్ళని నమ్మి 12 లక్షలు సిద్ధం చేస్తాడు. ఇక ఆ డబ్బులను తీసుకుని నిందితులు పరారయ్యారు. రెండు రోజులు వేచి చూసినా లాభం లేకపోయేసరికి బగాడియా తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరినీ పట్టుకుని రూ.12 లక్షలు రికవరీ చేశారు.