Funny Video: పాపం.. పాప పానీపూరి లాగేసుకున్నాడు.. మరి అమ్మాయి ఏం చేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..

|

Jul 04, 2021 | 6:49 PM

Funny Video: సోషల్ మీడియాలో నిత్యం మనం ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు మనకు..

Funny Video: పాపం.. పాప పానీపూరి లాగేసుకున్నాడు.. మరి అమ్మాయి ఏం చేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..
Viral Video
Follow us on

Funny Video: సోషల్ మీడియాలో నిత్యం మనం ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు మనకు కనిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో కొందరు యువకుడు ఎక్కువగా ప్రాంక్ వీడియోలు చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో, వీడియో షేరింగ్ యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోల్లో కొన్ని నెటిజన్లను, కామన్ పీపుల్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అది చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరంటే నమ్మండి.

పానీపూరి అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. జీవితంలో ఏమీ లేకపోయినా పానీపూరి మాత్రం లేకుంటే ఒప్పుకోం అనేవాళ్లు చాలా మందే ఉన్నారు. అంతలా పానీపూరీని ప్రేమించే వాళ్లు ఉన్నారు. మరి అలాంటి వారి ప్లేట్ నుంచి పానీపూరిని లాగేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది. అది కూడా ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి ఒక అమ్మాయి ప్లేట్ నుంచి పానీపూరిని లాగేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ సీన్ తరువాత అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఊహించడానికి చాలా సరదాగా ఉంది కదా.. అయితే, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి తాజాగా నెట్టింట్లో సర్క్యూలేట్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ముగ్గురు అమ్మాయిలు(స్నేహితులు) పానీపూరి తింటున్నారు. ఇంతలో అక్కడి వచ్చిన ఓ యువకుడు.. వారి పక్కనే నిలుచున్నారు. పానీపూరి బండి అతను ఓ అమ్మాయి ప్లేట్‌లో పానీపూరి వేయగా.. పక్కన ఉన్న యువకుడు ఆ పానీపూరిని తీసుకుని తినేశాడు. అది చూసి ఆ యువతి షాక్ అయ్యింది. అతను అలా పానీపూరి తీసుకోవడంతో ఆగ్రహాంతో (కంటి చూపుతో చంపేస్తా అనేలా) ఓ చూపు చూసింది ఆ యువతి. అయినా సరే ఆ యువతి రియాక్షన్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా.. మరో పానీపూరిని ఆ యువతి ప్లేట్‌ నుంచి తీసుకుని తినేశాడు. దీంతో అప్పటి వరకు ఆగ్రహం, షాకింగ్‌లో ఉన్న యువతి మొహంలో కాస్త నవ్వు కనిపించింది. పక్కనున్న మిగతా ఇద్దరు అమ్మాయిలు కూడా తెగ నవ్వేశారు. ఆ తరువాత ఇది ప్రాంక్ అని చెప్పడంతో అంతా నవ్వుకున్నారు. మొత్తానికి ఈ వీడియో ఫన్నీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రమ్‌లో ఈ వీడియోను షేర్ చేయగా.. దీనికి చాలా మంది నెటిజన్లు లైక్స్ కొడుతున్నారు. రెండు రోజుల క్రితం ఈ వీడియోను షేర్ చేయగా.. ఇప్పటి వరకు 50 వేల మందికిపైగా వీక్షించారు. ఫన్నీగా ఉన్న ఈ వీడియోను మీరు కూడా చూసి కొంచెం రిలాక్స్ అవ్వండి.

Viral Video:

Also read:

Team India: పృథ్వీషాను కోరినట్లైతే.. వాళ్లను అవమానించినట్లే: మాజీ సారథి కపిల్ దేవ్

లారీని ఢీకొట్టిన కారు, అదే కారుని వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టిన వైనం, నలుగురు స్పాట్ డెడ్

సిరిసిల్లలో బిజీ.. బిజీగా గడిపిన సీఎం.. ఓ వైపు చలోక్తులు, మరో వైపు అభివృద్ధి మాటలు, మరోచోట తీవ్ర అసహనం.!