ఇది ఫేక్ న్యూస్ కానేకాదు.. మీరు చదవింది అక్షరాల నిజం. వాడి కిందపడేసిన ఆ టిష్యూ పేపర్‌ను ఏకంగా రూ.7.5 కోట్లకు ఆన్‌లైన్ వేలంలో అమ్మకానికి పెట్టారు. మరి ఆ టిష్యూ పేపర్‌కు అంత గిరాకీ ఎందుకనేగా మీ డౌట్.. అది అల్లాటప్పా టిష్యూ పేపర్ కాదు బాబు.. ఏకంగా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కన్నీరు తుడిచిన ‘పవిత్రమైన’ టిష్యూ పేపర్. అందుకే ఆ టిష్యూ పేపర్‌ను దక్కించుకునేందుకు మెస్సీ వీరాభిమానులు చాలా మంది పోటీపడుతారని భావిస్తున్నారు. ఆ టిష్యూ పేపర్ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల లియోనల్ మెస్సీ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పాడు. ఈ సందర్భంగా ఫేర్‌వెల్ ప్రెస్‌మీట్‌లో బార్సిలోనాతో తన రెండు దశాబ్ధాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మెస్సీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఓ టిష్యూ పేపర్‌తో తుడుచుకున్నాడు.
ఈ టిష్యూ పేపర్ మెస్సీ వాడింది కావడంతో ఓ ప్రబుద్ధుడు దాన్ని ఓ ఈ-కామర్స్ సైట్‌లో వేలానికి పెట్టాడు. వేలంలో దాని ధరను 1 మిలియన్ డాలర్లు (రూ.7.5 కోట్లు)గా నిర్ణయించాడు. రండి బాబు రండి..మెస్సీ కన్నీరు తుడిచిన టిష్యూను దక్కించుకోండంటూ ఆన్‌లైన్ యాడ్స్ కూడా ఇచ్చాడు. మెస్సీ వాడిపడేసిన టిష్యూ అంటే మాటలా మరి అంటూ మీడియా కూడా ఉచిత ప్రచారంతో దంచికొడుతున్నాయి. దీంతో ఆ టిష్యూ పేపర్‌కు ఆయన వీరాభిమానుల మధ్య గట్టి పోటీ నెలకొంటోంది.
When Messi cries, we all cry.
Big hug. ❤️ u Leo. pic.twitter.com/wAHhzWrkP3— FC Barcelona (@FCBarcelona) August 8, 2021
మెస్సీ వాడిపడేసిన టిష్యూను వేలంలో 1 మిల్లియన్ డాలర్లుగా నిర్ణయించడంపై కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. వీరాభిమానులు మాత్రం మా దేవుడి కన్నీరు తుడిచిన ఆ టిష్యూ అమూల్యం..దాని ముందు ఎన్ని కోట్లైనా దిగదుడుపే అంటున్నారు. మరి ఆ టిష్యూ పేపర్‌ను ఏ డబ్బును మెస్సీ వీరాభిమాని ఆన్‌లైన్ వేలంలో దక్కించుకుంటాడో వేచిచూడాల్సిందే. మీరు కూడా మెస్సీ వీరాభిమానులైతే ట్రై చేసుకోవచ్చు.
Also Read..
JioPhone Next: జియోఫోన్ నెక్స్ట్ త్వరలో మార్కెట్ లోకి వచ్చేస్తోంది.. దీని ధర ఎంతో తెలుసా?
కడుపున పుట్టినవాళ్లే ఆస్తి కోసం వేధించారు.. కన్నీళ్లతో బ్రతకలేక.. తనువు చాలించారు
వివాదంలో చిక్కుకున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్.. సినిమా రిలీజ్ ఆపేయాలంటున్న మహిళా సంఘాలు.. కారణం ఇదే