300-year-old mummy: ఈజీప్ట్ లో ఎక్కువగా మమ్మీలు కనిపిస్తూ ఉంటాయి. రకరకాల మమ్మీల గురించి ఇప్పటికే చాలా రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా జపాన్(Japan)లోని ఒకాయమా ప్రిఫెక్చర్ దేవాలయంలోని ఓ పెట్టెలో లభించిన 12 అంగుళాలు (30.5 సెంటీమీటర్లు) పొడవు ఉన్న మమ్మీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ మమ్మీ చాలా వినూత్నంగా ఉంది. నడుము వరకు మనిషిలా, మిగతా భాగం చేపను పోలి ఉంది. దీంతో ‘మత్స్యకన్యల’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు మత్స్యకన్యల గురించి చాలా విషయాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఈ మమ్మీపై పరిశోధనలు జరిగితే చాలా విషయాలు బయపడుతాయంటున్నారు పరిశోధకులు. 300 ఏళ్ల కిందట ఓ మత్స్యకారుడికి దొరికిన ఈ ‘మత్స్యకన్య’ దొరికినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని జాగ్రత్తగా ఆలయంలో భద్రపరిచి ఉంటారని చెబుతున్నారు. ఆ పెట్టలో దొరికిన ఆధారాల ప్రకారం 1736-1741 మధ్య కాలంలో ఒక జాలరి.. ఈ మత్స్యకన్యను పట్టుకున్నాడని చెబుతున్నారు. కురాషికి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు ఈ మమ్మీపై పరిశోధనలు జరుపుతున్నారు. దాని DNA నమూనాలను సైతం పరిశీలిస్తున్నారు. ఫలితాలు ఈ ఏడాదిలో ప్రకటించే అవకాశాలున్నాయి. పురాణాల్లో, జానపద కథల్లో కూడా ఈ ‘మత్స్యకన్య’ ల గురించి ప్రస్తావన ఉంది. జపాన్, కొరియా ప్రజలు మత్స్యకన్యల గురించి ఎక్కువగా నమ్ముతారు. మత్య్సకన్యలను తింటే అమరత్వం లభిస్తుందని అక్కడి ప్రజల విశ్వాసం. అది కోతి-చేప కలయిక వల్ల పుట్టిన కొత్త జాతి కావచ్చని కొందరు చెబుతున్నారు. పరిశోధనలు పూర్తియితేనే పూర్తి క్లారిటీ వస్తుంది.
Also Read: Andhra Pradesh: బైక్ నడుపుతుండగా వినిపించిన వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్..