Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ సతీమణికి అరుదైన గౌరవం..

Nita Ambani Becomes 1st Indian Trustee to be Elected to Board of New York’s Metropolitan Museum of Art, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ సతీమణికి అరుదైన గౌరవం..

ప్రముఖ విద్యావేత్త, బిజినెస్ వుమెన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. తరచూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆమె.. న్యూయార్క్‌లోని అతిపెద్ద మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ బోర్డుకు గౌరవ ధర్మకర్తగా ఎంపికయ్యారు. దేశ కళలు, సంస్కృతిని విశ్వవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఆమెకు ఈ అరుదైన గౌరవం లభించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో మ్యూజియం ఛైర్మన్‌ డేనియల్‌ బ్రాడ్‌స్కీ నీతా అంబానీని గౌరవ ధర్మకర్తగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ గౌరవం దక్కిన తొలి తొలి భారతీయురాలు నీతా అంబానీనే.

Nita Ambani Becomes 1st Indian Trustee to be Elected to Board of New York’s Metropolitan Museum of Art, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ సతీమణికి అరుదైన గౌరవం..

సమావేశంలో భాగంగా మ్యూజియం ఛైర్మన్ డేనియల్‌ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కళలను విశ్వవ్యాప్తం చేయడంలో ఆమె చేస్తున్న కృషి అనిర్వచనీయమైందని.. ఆమె మద్దతుతో ప్రపంచం నలుమూలల ఉన్న కళల గురించే అధ్యయనం చేసే సామర్థ్యం ఈ మ్యూజియంకు లభించిందన్నారు. ఇక రిలయన్స్ ఫౌండేషన్ (సేవా సంస్థ)కు కూడా నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌ 2016 సంవత్సరం నుంచి మెట్రోపాలిటన్‌ ఆర్ట్‌ మ్యూజియంకు మద్దతు తెల్పుతోంది. ఈ మ్యూజియంలో ప్రతి ఏటా ప్రత్యేక షోలను నీతా అంబానీ నిర్వ‌హిస్తున్నారు.