Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

మహేష్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘సరిలేరు నీకెవ్వరు’లో కొత్త సీన్స్

New scenes to be added in Sarileru Neekevvaru Movie, మహేష్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘సరిలేరు నీకెవ్వరు’లో కొత్త సీన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. కాగా..ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ విజయవంతంగా దూసుకువెళ్తుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో మరికొన్ని కొత్త సీన్లను యాడ్ చేస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు సినిమాకి సంక్రాంతి కళ వచ్చిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి సినిమా లెన్త్ ఎక్కువ అవడం వల్ల కొన్ని సీన్స్‌ని కట్ చేశామని అవి ఈ శుక్రవారం నుంచి సినిమాలో జోడిస్తామని చెప్పారు అనిల్.

కాగా.. ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, సంగీత, హరితేజ, తమన్నా, వెన్నెల కిశోర్‌, సత్యదేవ్‌, అజయ్‌, సుబ్బరాజు, నరేష్‌, రఘుబాబు, సత్యం రాజేష్‌, బండ్ల గణేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Related Tags