#COVID19 తెలంగాణలో కొత్త భయం… ఒక్కరోజులో సీన్ మారింది

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త భయం పట్టుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి అదుపులోనే వుందని, అంతా అనుకున్నట్లు సాగితే.. ఏప్రిల్ ఏడో తేదీ నాటికి రాష్ట్రంలో కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పిన రెండో రోజే సీన్ మారిపోయింది.

#COVID19 తెలంగాణలో కొత్త భయం... ఒక్కరోజులో సీన్ మారింది
Follow us

|

Updated on: Apr 01, 2020 | 2:09 PM

New fear among Telangana people: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త భయం పట్టుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి అదుపులోనే వుందని, అంతా అనుకున్నట్లు సాగితే.. ఏప్రిల్ ఏడో తేదీ నాటికి రాష్ట్రంలో కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పిన రెండో రోజే సీన్ మారిపోయింది. దాంతో తెలంగాణ జనం మళ్ళీ బిక్కుబిక్కు మనే భయాందోళన మధ్య జీవనం సాగించడం మొదలైంది. దీనికి ఢిల్లీ సదస్సే కారణం కావడంతో అందుకు కారకులను, రహస్యంగా వైరస్ వ్యాప్తికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు తెలంగాణ ప్రజలు పలువురు.

తెలంగాణలో పరిస్థితి ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. కరోనా వైరస్‌ అదుపులో ఉందనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ బిక్కుబిక్కుమనే లెవెల్‌కు చేరుకుంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లో నిర్వహించిన సదస్సు, దానికి హాజరైన వారి అనుమానాస్పద ప్రవర్తన ఇప్పుడు తెలంగాణవాసులను భయపెడుతున్నాయి. తెలంగాణ నుంచి వందలాది మంది ఢిల్లీ వెళ్లి వచ్చారన్న సమాచారం ఇప్పుడు స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది.

మొన్నటి వరకు పరిస్థితి అదుపులోనే ఉందనే మాట తెలంగాణవాసులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ మాట కూడా ఏకంగా ముఖ్యమంత్రి నోటి వెంట రావడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా రేగిన కలకలం ముచ్చెమటలు పట్టిస్తోంది. అక్కడికి వెళ్లి వచ్చినవారు ఎన్ని చోట్ల తిరిగారో? ఎంతమందితో సన్నిహితంగా మెలిగారో? అన్న భయాందోళన ఇప్పుడు చాలా మందిలో కలవరం రేపుతున్నాయి.

తెలంగాణ నుంచి వెయ్యికి మించి సదస్సుకు వెళ్లి ఉంటారని పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు తరలించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఆరు వందల మంది ఢిల్లీకి వెళ్లినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఇప్పటికే పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్‌ అని తేలింది. మరో 74 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సంఖ్య 97కు చేరింది. వీరిలో 14 మంది కోలుకున్నారు. ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతం వేరువేరు ఆసుపత్రులలలో 77 మంది చికిత్స పొందుతున్నారు.

నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వాళ్లంతా గాంధీ ఆసుపత్రికి పరీక్షల కోసం రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఇప్పటికే గుర్తించిన వారందరికీ ఆయా జిల్లాలలోని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. లక్షణాలు ఉన్నవారికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబాలను కూడా క్వారంటైన్‌లో ఉంచారు. అన్ని కుటుంబాలకు ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఢిల్లీ సదస్సుకు ఇంత మంది వెళితే.. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు సమాచారం లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారు రహస్యంగా ఎందుకు గడిపారు… ఇన్ని పిలుపుల తర్వాత కూడా అందరూ ఎందుకు బయటికి రావడం లేదన్న అనుమానాలు పలువురిలో భయాందోళన పెంచుతున్నాయి. ప్రభుత్వం ఈ కోణంలోను దర్యాప్తు జరపాలని, ఇందులో కుట్ర కోణం వుంటే తగిన విధంగా శిక్షించాలని కోరుతున్నారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో