అంతర్వేది: నూతన రథానికి ప్రారంభమైన పనులు

పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొత్త రథానికి పనులు ప్రారంభమయ్యాయి.

అంతర్వేది: నూతన రథానికి ప్రారంభమైన పనులు
Follow us

| Edited By:

Updated on: Sep 19, 2020 | 12:18 PM

Antarvedi new chariot: పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొత్త రథానికి పనులు ప్రారంభమయ్యాయి. రావులపాలెం వెంకటసాయి టింబరు డిపోలో నూతన రథ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. 100 సంవత్సరాల బస్తరు టేకుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు కలపను కోయిస్తున్నారు. రానున్న స్వామి కల్యాణానికి నూతన రథాన్ని పూర్తి చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కాగా ఈ నెల 6వ తేదిన అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అంతర్వేదిలోని రథం దగ్ధమైంది. ఆ రథం 40 అడుగుల ఎత్తు ఉండగా.. 60 ఏళ్ల క్రితం నాటిది. ప్రతి సంవ‌త్స‌రం కల్యాణోత్సవంలో ఉత్సవమూర్తులను ఆ రథంపైనే ఊరేగించేవారు. ఆ తరువాత ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో భద్రపరిచేవారు. అలాంటి రథం దగ్ధం అవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రాజకీయంగానూ ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Read More:

Bigg Boss 4: ‘బిగ్‌బాస్’ పనిష్మెంట్‌కి నెటిజన్ల రియాక్షన్లు ఇవే

ఆందోళన అక్కర్లేదు.. పిల్లల్లో ఆ లక్షణం కరోనా కాదు