Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

ఆకాశానికి నేలకొండపల్లి నేల ధరలు

Nelakondapalli Real Estate Boom, ఆకాశానికి నేలకొండపల్లి నేల ధరలు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పేరు దాదాపు అందరికీ సుపరిచతమే. ఎందుకంటే..చారిత్రకంగా, పర్యాటకంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన భధ్రాచల రామాలయాన్ని నిర్మించిన కంచెర్ల గోపన్న అతడే.. భక్త రామదాసు జన్మస్ధలం. అంతేకాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ స్తూపం ఇక్కడే ఉంది. కాకతీయుల కాలం నాటి దేవాలయాలు, ముస్లీం రాజుల భవనాలు అనేకం ఇక్కడ దర్శనమిస్తాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ప్రాంతంలో గజం జాగా ఉన్న కలిసివస్తుందనే సెంటిమెంట్‌ ఇప్పుడు ఇక్కడి ప్రజల్లో బలంగా ఏర్పడింది. అదే సెంటిమెంట్‌ను క్యాచ్‌ చేసుకుంటూ..రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సైతం అడ్డగోలుగా ప్లాట్ల దందాకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం భూముల ధరలు కోట్లలో పలుకుతుండటంతో సామాన్యులను ఆందోళనకు గురిచేస్తుంది.
నేలకొండపల్లి ఖమ్మం నుంచి కోదాడకు వెళ్లే దారిలో 15 కి.మీ.దూరంలో ఉంటుంది. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి. పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట నగరాన్ని పాలించే విరాట రాజు కొలువులో మారువేషాల్లో చేరారు. విరాట రాజు బావమరిది కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామించగా, వలలుడి వేషంలో ఉన్న భీముడు కీచకుణ్ణి చంపేసాడు. ఆ విరాటనగరం ఈ ప్రాంతమేనని పౌరాణిక గాధ. మహాభారతం జరిగిందని చెప్పబడుతున్న కాలం నాటి అవశేషాలు ఇక్కడ దొరకడం విశేషం. 1977 లో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ అవశేషాలు, స్థూపాలు, విగ్రహాలు దొరకడంతో ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లిందని ఆనావాళ్లు చెబుతున్నాయి. ఇటీవలి చరిత్రకు వస్తే.., నేలకొండపల్లి భక్త రామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న ఇక్కడే జన్మించాడు. ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరం గా పిలుస్తున్నారు. గ్రామంలో దాదాపు 20 వరకు పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్కరు నేలకొండపల్లిలో ఓ ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటున్నారు. దీంతో మహా నగరాలకు ధీటుగా ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గజం ధర రూపాయలు లక్ష నుంచి రెండు లక్షలు పలుకుతుంది. పర్యాటక కేంద్రంగా రూపొందటంతో పాటు ప్రశాంత వాతావరణం ఉంటుందని అందరి చూపు నేలకొండపల్లిపైనే ఉంది. దీంతో సామాన్య ప్రజలు ఒక గజం భూమి కొనాలన్నకొనలేని పరిస్థితి నెలకొంది. రాబోవు రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
ఏదేమైనప్పటికీ ఇక్కడి స్థానికులు మాత్రం తమ ప్రాంతం అభివృద్ధి చెందటంతో పాటు..తమ భూములు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Tags