Viral News: అప్పుడే పుట్టిన ఆడపిల్లకు అరుదైన రూపం.. వింత శిశువును చూసి విస్తుపోయిన వైద్యులు

|

Dec 16, 2022 | 1:24 PM

చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పారు. ఇలా ఎందుకు జరిగిందనే విషయమై ఇంతవరకు అసలు కారణం తెలియరాలేదని డాక్టర్లు చెప్పారు. కానీ, తల్లి కడుపులో పిండం..

Viral News: అప్పుడే పుట్టిన ఆడపిల్లకు అరుదైన రూపం..  వింత శిశువును చూసి విస్తుపోయిన వైద్యులు
Baby
Follow us on

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ నాలుగు కాళ్లతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నగరంలోని సికందర్‌ క్యాంపు ప్రాంతంలో నివసిస్తున్న మహిళ పేరు ఆర్తి కుష్వాహా. పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఆ మహిళ బుధవారం కమల రాజా ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాప బరువు 2.3 కిలోలు కాగా, శిశువు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పారు. ఇలా ఎందుకు జరిగిందనే విషయమై ఇంతవరకు అసలు కారణం తెలియరాలేదని డాక్టర్లు చెప్పారు. కానీ, తల్లి కడుపులో పిండం సరిగ్గా అభివృద్ధి చెందనప్పుడు అటువంటి శారీరక వైకల్యాలు కనిపిస్తాయన్నారు.

డాక్టర్ ఆర్కేఎస్ ధాకడ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఈ బాలిక వెనుకవైపు నడుం కింది భాగంలో అదనంగా రెండు కాళ్ళతో పుట్టిందని చెప్పారు. అయితే, ఆ కాళ్లు ఉపయోగించే వీలు లేకుండా ఉందన్నారు.ఇది తప్ప బాలిక శరీరంలో మరో వైకల్యం లేదని వైద్యులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

బిడ్డ ఆరోగ్యంగా ఉంటే క్రియారహితంగా ఉన్న రెండు కాళ్లను ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇదంతా విచారణ తర్వాతే తేల్చనుంది. ఇందుకోసం వైద్యుల బృందం తమలో తాము చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో యూపీలోని చౌసానాలో మూడు కాళ్ల నవజాత శిశువు జన్మించింది. పుట్టిన తరువాత, పిల్లల అల్ట్రాసౌండ్ జరిగింది. దీనిలో పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించాడు. చిన్నారి తల్లి కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. అదే సమయంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌లో రెండు తలలు, మూడు చేతులతో ఓ చిన్నారి జన్మించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి