TV9 నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్‌క్లేవ్‌లో మూడవ రోజున జరిగిన పవర్ కాన్ఫరెన్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. యుద్ధంతో అతలాకుతలమైన ప్రపంచంలో ఏ దేశమైనా శాంతిని నెలకొల్పగలదంటే అది భారత్ మాత్రమేనని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ప్రధాని మోదీ తీసుకున్న చొరవను ప్రపంచం చూసి ఆమోదించిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చాలా దేశాల్లో భారత్ పాత్ర ముఖ్యమైనదని ఆయన అన్నారు.
పాకిస్థాన్‌తో శాంతి, సుస్థిరత ఉండేలా ప్రయత్నిస్తున్నామని, అయితే ప్రస్తుత పరిస్థితికి అక్కడి ప్రజలను నిందించబోమని చెప్పారు. అయితే అక్కడి పాలకులు ఎలాంటి వ్యూహాలు పన్నినా పరిస్థితి మరింత దిగజారుతుందని రక్షణ మంత్రి అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నంత కాలం సంబంధాలు మెరుగుపడవని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. స్నేహితులు మార్చవచ్చు.. కానీ పొరుగువారిని మార్చలేం అని అటల్‌జీ అన్న విషయాన్ని గుర్తు చేశారు.
తాను గతంలో హోం మంత్రిగా పని చేసిన వ్యక్తిగా చెబుతున్నానని.. ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా చాలా మంచి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, నక్సలిజాన్ని అంతమొందించడంలో అమిత్ షా పెద్ద పాత్ర పోషించారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఈరోజు కాశ్మీర్‌లో ఎక్కడ చూసినా శాంతి కనిపిస్తోందని చెప్పారు. అభివృద్ధి పథంలో కశ్మీర్ ముందుందని.. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అక్కడ పెద్ద మార్పును చూస్తున్నారని.. ఉగ్రవాాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారు. గత పదేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక ఎక్స్‌పోర్ట్స్ కంట్రీగా భారత్‌ను చేర్చామన్నారు. నేడు రూ.20 వేల కోట్లకు పైగా ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నామని, త్వరలో రూ.50 వేల కోట్లను ఈ సంఖ్యను తీసుకెళ్లామన్నారు.
భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…