భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ 2024 కోసం టీవీ9 వేదికగా సమరశంఖం పూరించారు. హ్యాట్రిక్ గెలుపు మంత్రం ఏంటో చెప్పేసిన ప్రధాని. మోదీ మంత్రమే అత్యుత్తమం, అతి పెద్దది అని చెబుతూ.. మెజారిటీతో మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 వార్షిక సదస్సు వాట్ ఇండియా థింక్స్ టుడే రెండో రోజున ఆయన విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. భారతదేశం రెడ్ టేప్, వాయిదా విధానాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదన్నారు. కాంగ్రెస్ విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా గత పదేళ్ల లెక్కలను ఆయన ప్రజల ముందుంచారు. మనం ఏది చేసినా మంచిదే, పెద్దది చేస్తాం అనే మంత్రాన్ని అందించారు. మిషన్ 2024 కోసం రాజకీయ ఎజెండాను TV-9 వేదిక ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
మనసులో ఆశతో ఉన్న భారతదేశ పురోగతికి గల కారణాలను ప్రతిబింబించడంలో ఎవరి గుండెల్లో మక్కువ ఉంటే ఏదో ఒకటి జరిగేలా చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ మంత్రం ఇచ్చారు. మనం ఉద్వేగభరితంగా ఉన్నప్పుడే అడుగు పెద్ద ఎత్తును వేయగలం. ఫుల్ ఎనర్జీ ఉంటుంది. నిరాశ, నిస్పృహతో ఉన్న దేశం లేదా వ్యక్తి బిగ్ లీప్ గురించి ఆలోచించలేరన్నారు ప్రధాని. “ఈ ఒక్క ఇతివృత్తం చాలు, నేటి భారతదేశం ఆత్మవిశ్వాసం ఎంత ఉన్నతంగా ఉందో చెప్పడానికి. ఆకాంక్షలు ఏమిటి? ఈ రోజు భారతదేశం పెద్ద ఎత్తుకు సిద్ధంగా ఉందని ప్రపంచం భావిస్తోంది. కాబట్టి దీని వెనుక పదేళ్ల పవర్ ఫుల్ లాంచ్ ప్యాడ్ ఉంది. పదేళ్లలో ఏం మారింది? ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము. ఈ మార్పు మనస్తత్వానికి సంబంధించినది, ఈ మార్పు ఆత్మవిశ్వాసం, సుపరిపాలన వల్లే వచ్చింది. మన్ కే హరే హర్ హై, మన్ కే జితే జీత్ హై అని పాత సామెత ఉంది.” అంటూ పదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయగాథను ఈ సరళమైన మాటల్లో వివరించారు.
మొదటి, రెండవ, మూడవ పారిశ్రామిక విప్లవాలలో మనం వెనుకబడ్డము. మనం ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచానికి నాయకత్వం వహించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు దిశానిర్ధేశం చేశారు. భారతదేశంలో ప్రతిరోజూ రెండు కొత్త కళాశాలలు ప్రారంభమవుతున్నాయని, ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం తెరుకుంటుందని ఆయన అన్నారు. భారతదేశంలో ప్రతిరోజూ 36 కొత్త స్టార్టప్‌లు సృష్టించడం జరుగుతుంది. భారతదేశంలో ప్రతిరోజూ 16 వేల కోట్ల రూపాయల విలువైన యుఎఐ లావాదేవీలు జరిగాయి. భారతదేశంలో ప్రతిరోజూ 14 కి.మీ రైల్వే ట్రాక్ నిర్మించడం జరిగింది. భారతదేశంలో ప్రతిరోజూ 5 వేలకు పైగా ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, భారతదేశంలో ప్రతి సెకనుకు ఒక కుళాయి ద్వారా కనెక్షన్ ఇస్తున్నామని ఆయన వివరించారు. భారతదేశంలో ప్రతిరోజూ 75 వేల మంది పేదరికం నుండి బయటపడుతున్నారు. పేదరిక నిర్మూలన నినాదాలు మనం ఎప్పుడూ వింటూనే ఉన్నాం. పదేళ్లలో 25 కోట్ల మంది దారిద్య్రరేఖ నుంచి బయట పడతారని ఎవరు ఊహించలేదు. కానీ అది జరిగింది. అది మన ప్రభుత్వంలోనే జరిగిందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్ని పథకాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. జాప్యం జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో 80వ దశకంలో శర్యు కెనాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. 2014లో ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేశాం. సర్దార్ సరోవర్ పునాది రాయిని 60వ దశకంలో పండిట్ నెహ్రూ వేశారు. సర్దార్ సరోవర్ డ్యామ్ పనులు 60 ఏళ్లుగా నిలిచిపోయాయి. 2017లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆనకట్టను పూర్తి చేసి జనరంజకంగా మార్చాం. మహారాష్ట్రలోని కృష్ణా కోయినా ప్రాజెక్టు కూడా 80వ దశకంలో రూపొందించడం జరిగింది. ఈ డ్యాం పనులు కూడా మన ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు మోదీ.
కొన్ని రోజుల క్రితం అటల్ టన్నెల్ చుట్టూ మంచు కురిసేలా చూశారు. అటల్ టన్నెల్ శంకుస్థాపన కూడా 2002లో జరిగింది. 2014 వరకు ఏమీ జరగలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వదిలి వేసిన పనిని కూడా బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఇది 2020లో ప్రారంభించడం జరిగింది. అస్సాం బోగీ బిల్ బ్రిడ్జ్ B 1988లో ఆమోదించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 20 ఏళ్లలో పూర్తి చేశాం. 15 సంవత్సరాల తర్వాత ఇన్‌స్టంట్ డెడికేటెడ్ ఫ్రెడ్ కారిడార్‌ను కూడా పూర్తి చేసాం. కనీసం 500 అటువంటి ప్రాజెక్టులు మిగిలిపోయాయి. ఇలాంటి వందలాది ప్రాజెక్టులను పూర్తి చేశాం. కాంగ్రెస్ హయాంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు త్వరగా ఎలా పూర్తయ్యాయో ప్రధాని తెలియజేశారు.
మన ప్రభుత్వ పాలనకు కొన్ని ఉదాహరణలు చెబుతానంటూ తాను చేపట్టిన అభివృద్ధి పనులనను వివరించారు ప్రధానమంత్రి మోదీ. ముంబైలోని అటల్ సేతు దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన. దీని శంకుస్థాపన 2016లో జరిగిందన్నారు. దీనిని ఆవిష్కరించామన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాం. AIIMS జమ్మూచే సృష్టించడం జరిగింది. పూర్తి చేసిన రాజ్‌కోట్, తిరుచ్చి విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించాం. ఐఐటీ భిలాయ్‌కు శంకుస్థాపన చేసి ప్రారంభించాం. గోవా కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించాం. లక్షద్వీప్‌లో ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని వారాల క్రితం పూర్తి చేసాము. ద్వారకలో ఉన్న సుదర్శన్ సేతు ఫోటో చూశాను. ఈ వంతెనకు మేము పునాది వేసి.. దానిని త్వరిగతగతిన పూర్తి చేశామన్నారు ప్రధాని. దీన్నే మోదీ గ్యారంటీ అంటున్నాను. ఈ వేగం ఉన్నప్పుడు, వేగంగా పని చేయాలనే సంకల్పం ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారుల డబ్బు గౌరవించడం జరుగుతుంది. అప్పడే భారతదేశం పురోగమిస్తున్న వేగం ఊహకందని ప్రధాని మోదీ అన్నారు.
భారతదేశంలో వినియోగంపై ఒక నివేదిక ఉంది. ఇది కొత్త ట్రెండ్‌ని వెల్లడిస్తోంది. భారతదేశంలో పేదరికం ఇప్పుడు సింగిల్ డిజిట్‌లో ఉంది. ఈ డేటా ప్రకారం, వినియోగం రెండున్నర శాతం పెరిగింది. గత పదేళ్లలో గ్రామంలో వినియోగం పెరిగింది. అంటే గ్రామంలో ప్రజల ఆర్థిక శక్తి పెరుగుతోంది. 2014 తర్వాత మన ప్రభుత్వం గ్రామాన్ని ముందు ఉంచి మౌలిక వసతులను కల్పిస్తోంది. మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నించాం. ఈ అభివృద్ధి నమూనా ద్వారా భారతదేశం సాధికారత పొందింది అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…