Kaali: మరింత ముదురుతున్న కాళీ వివాదం.. మహువా మొయిత్రా వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఏమన్నారంటే

దేశంలో వివాదాస్పదమైన కాళీ (Kalee) అంశంపై పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Benerjee) స్పందించారు. తమ పార్టీకి చెందిన నేత మహువా మొయిత్ర చేసిన కామెంట్లపై దీదీ ఇంట్రస్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. పని చేసేప్పుడు తప్పులు...

Kaali: మరింత ముదురుతున్న కాళీ వివాదం.. మహువా మొయిత్రా వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఏమన్నారంటే
Mamata Banerjee
Follow us

|

Updated on: Jul 08, 2022 | 6:37 AM

దేశంలో వివాదాస్పదమైన కాళీ (Kalee) అంశంపై పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Benerjee) స్పందించారు. తమ పార్టీకి చెందిన నేత మహువా మొయిత్ర చేసిన కామెంట్లపై దీదీ ఇంట్రస్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. పని చేసేప్పుడు తప్పులు చేస్తుంటామని, వాటిని సరిదిద్దుకోవచ్చని అన్నారు. కొందరు మంచిని చూడకుండా కేవలం నెగటివిటీ వైపే ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. నెగిటివిటీ ఆలోచనలు మనల్ని దెబ్బతీస్తుందన్న మమతా బెనర్జీ.. సానుకూలంగా ఆలోచించాలని కోరారు. డైరెక్టర్ లీనా మణిమేకల దర్శకత్వం వహిస్తున్న కాళీ(Goddess Kali) డ్యాక్యూమెంటరీ పై వివాదం నెలకొంది. ఇటీవల ఈ డాక్యూమెంటరీ నుంచి కాళీ మాత పోస్టర్ విడుదల కావడంతో అందులో కాళీ చేతిలో సిగరెట్ ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. అమ్మవారి చేతిలో సిగరెట్ ఉండడం ఏంటీ అంటూ డైరెక్టర్ లీనా పై మండిపడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల డైరెక్టర్ లీనా పై కేసులు నమోదయ్యాయి. ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ వినిపిస్తున్నాయి.

తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా కూడా ఈ వివాదంలో ఇరుక్కున్నారు. కాళీ మాత మాంసాహారం తింటుంది.. మద్యం సేవిస్తుంది.. అంటూ మహువా చేసిన వ్యాఖ్యలపై రగడ కొనసాగుతోంది. మహువా మొయిత్రాను వెంటనే అరెస్ట్ చేయాలని కోల్‌కతాలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కూడా మహువా మొయిత్రాపై కేసు నమోదయ్యింది. త్వరలోనే భోపాల్‌ పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యలతో సంబంధం లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.

Latest Articles
అనారోగ్యం, పేదరికంతో ఇబ్బందులా.. ఈ మంత్రాలు పఠించి చూడండి
అనారోగ్యం, పేదరికంతో ఇబ్బందులా.. ఈ మంత్రాలు పఠించి చూడండి
అతను గిటార్ ప్లే చేస్తున్నాడు.. ఇంతలో దూసుకొచ్చిన పాము.. ఆ తర్వాత
అతను గిటార్ ప్లే చేస్తున్నాడు.. ఇంతలో దూసుకొచ్చిన పాము.. ఆ తర్వాత
దళితవాచ్‌మెన్‌పై హోంగార్డుల దాష్టీకం..! మండిపడుతున్న నెటిజన్లు..
దళితవాచ్‌మెన్‌పై హోంగార్డుల దాష్టీకం..! మండిపడుతున్న నెటిజన్లు..
తెలంగాణలో జనం ఓటు ఎటు?
తెలంగాణలో జనం ఓటు ఎటు?
టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు లేకండానే బరిలోకి
టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు లేకండానే బరిలోకి
ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్‌ను నిర్దోషిగా తేల్చిన హైకోర్ట్..
ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్‌ను నిర్దోషిగా తేల్చిన హైకోర్ట్..
కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా
కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా
ఏడుస్తున్నట్టు కలలు వస్తున్నాయా.. జరిగేది ఇదే!
ఏడుస్తున్నట్టు కలలు వస్తున్నాయా.. జరిగేది ఇదే!
ఈ చిన్నారి సింగర్.. అందంలో హీరోయిన్లను టెన్షన్ పెట్టేస్తోంది..
ఈ చిన్నారి సింగర్.. అందంలో హీరోయిన్లను టెన్షన్ పెట్టేస్తోంది..
హోటల్స్‌లో దొరికే ఉగ్గానిని ఇంట్లోనే తయారు చేసుకోండి.. రెసిపీ
హోటల్స్‌లో దొరికే ఉగ్గానిని ఇంట్లోనే తయారు చేసుకోండి.. రెసిపీ