55 ఏళ్ల తర్వాత కూడా మహిళలు ఫిట్ గా ఉండాలంటే.. ఇలా చేయండి..
TV9 Telugu
15 May 2024
సాధారణంగా 40 ఏళ్లు దాటగానే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే 55 ఏళ్ల తర్వాత ముఖ్యంగా మహిళలకు పోషకాలు చాలా అవసరమవుతాయి.
మహిళ ఆరోగ్యంతోని కుటుంబం ఆరోగ్యంగానే సామెత మీరు కూడా వినే ఉంటారు. అలంటి మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎం చెయ్యాలో తెలుసుకుందాం.
ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎముకల దృఢంగా ఉండటానికి పాలు, పెరుగు, జున్ను, సోయాబీన్స్ వంటి ఆహారాలు తీసుకోవాలి.
శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్-డి చాలా అవసరం. సూర్యకాంతిలో గడపడం. పాలు, గుడ్లు, చేపలతో శరీరానికి కావలసిన విటమిన్ డి అందించాలి.
గుడ్లు, చేపలు, పప్పులు, గింజలు , మొలకెత్తిన ధాన్యాలు తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రొటీన్ లభిస్తుంది.
ఏ సీజన్‌లో లభించే పండ్లు, కూరగాయలు ఆ సీజన్లో బాగా తీసుకోవాలి. వీటిల్లో పైబర్ అధికంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.
బాదంపప్పులు, వాల్‌నట్స్, ఖర్జూరాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని ఆహారంలో తప్పక భాగం చేసుకోవాలి.
ప్రతి రోజూ 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. వయసు పెరిగే కొద్దీ ఆహారంలో ఉప్పు, పులుపు, కారం, చక్కెర తక్కువ తీసుకోవాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి