అంజీర్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. అంజీర్ జీర్ణ ఆరోగ్యానికి మంచిది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయపడుతుంది.
అంజీర్‌లో పాలీఫెనల్స్, ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
అంజీర్‌లో కాల్షియం, మెగ్నిషీయం, ఫాస్పరస్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది మన ఎముక ఆరోగ్యానికి మంచిది. ఆస్టియోపోరోసిస్ రాకుండా మన ఎముకలను అంజీర్ పండు కాపాడుతుంది. అంజీర్ పండ్లను మీ పిల్లలకు కూడా ఇవ్వండి వారి ఎముకలు దృఢంగా మారతాయి.
అంజీర్ పండులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన కడుపును ఎక్కువ సమయంపాటు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటుకు దూరంగా ఉంచుతుంది. ఫలితంగా మనం క్యాలరీలు తక్కువగా తీసుకున్నట్లవుతుంది.
అంజీర్‌లో పాలీఫెనల్స్, ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
అంజీర్ పండులో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులోని ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని నిర్వహిస్తాయి. ముఖ్యంగా అంజీర్‌లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చెక్ పెడతాయి.
అంజీర్‌ను నేరుగా కాకుండా నానబెట్టి తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ తింటే మంచిది. మహిళల్లో మెటాబాలీజం, స్టామినాను పెంచుతుంది. కాబ్టటి రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు.
ఫిగ్స్‌లోని డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. దీనిలోని విటమిన్ ఎ,సి,ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసి స్కిన్‌కు మంచి ఫలితాలు ఇస్తాయి. నానబెట్టిన అంజీర్‌ను రోజూ తింటే జుట్టుకు మంచిది.