రాత్రి పూట అన్నం బదులుగా చపాతీలు తింటున్నారా.?
TV9 Telugu
15 May 2024
ఈ మధ్యకాలంలో చాలామంది యువతకు ఊబకాయం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో చాలామంది తమ బరువును కంట్రోల్ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఎన్ని రకాల వర్కౌట్ లు చేసిన సమస్య మాత్రం పోవడంలేదు. దింతో ఏన్నో డైట్ లు చేస్తూ బరువును తగ్గడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.
రాత్రిపూట అన్నం మానేసి మరీ చపాతీలు తినడం మొదలుపెడుతున్నారు. అయితే ఇలా ఉన్నఫళంగా వైట్ రైస్ బదులు చపాతీలు తినడం మంచిది కాదట.
బరువు తగ్గాలనే క్రమంలో ఒక పూట పూర్తిగా రైస్ మానేసేకంటే.. అన్నం తక్కువ తిని.. చపాతీలు ఎక్కువ తీనడం బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు.
అలాగే రాత్రుళ్లు వేడివేడి చపాతీలు తినే బదులు నిల్వ ఉన్న చపాతీలు తినడం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందంటున్నారు వైద్యనిపుణులు.
అప్పుడే వేడిగా చేసి తినే చపాతీల్లో నూనె కంటెంట్ ఎక్కువ ఉంటుందని.. అలా కాకుండా నిల్వ ఉండే చపాతీలు తింటే అల్సర్, గ్యాస్ తగ్గుతాయని అంటున్నారు.
రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గి అనీమియా లేదా రక్తహీనతతో బాధపడుతున్నవారుచపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు.
ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు డాక్టర్‌ను సంప్రదించండి. ఇప్పడు మనం చెప్పుకున్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తించండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి