Watch Video: రాంగ్‌ రూట్లో ఓ పొలిటికల్ పార్టీ కారు.. చీకట్లో వైగంగా ఢీ కొట్టిన బైక్‌!.. భయానక వీడియో

|

Sep 20, 2024 | 12:07 PM

రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీ కొట్టడంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన న్యూఢిల్లీలోని గురుగ్రామ్‌లోని DLF ఫేజ్ IIలోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Watch Video: రాంగ్‌ రూట్లో ఓ పొలిటికల్ పార్టీ కారు.. చీకట్లో వైగంగా ఢీ కొట్టిన బైక్‌!.. భయానక వీడియో
Biker Hit By Car
Follow us on

గురుగ్రామ్, సెప్టెంబర్ 20: రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీ కొట్టడంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన న్యూఢిల్లీలోని గురుగ్రామ్‌లోని DLF ఫేజ్ IIలోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

న్యూఢిల్లీలోని ద్వారకలోని పోచన్‌పూర్‌కు చెందిన అక్షత్ గార్గ్ (23) అనే వ్యక్తి తలకు హెల్మెట్, చేతులకు గ్లోవ్స్‌తో సహా అన్నీ సేఫ్టీ గేర్‌లను ధరించి తన బైక్‌పై గురుగ్రామ్‌లోని DLF ఫేజ్ IIలోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో వెళ్తున్నాడు. అతడి స్నేహితుడు ప్రద్యుమన్ కుమార్ (22) అతని వెనుక మరొక బైక్‌పై వెళ్తూ కెమెరాతో షూట్‌ చేస్తున్నాడు. రోడ్డు టర్నింగ్‌ వద్ద ముందుకు వెళ్లిన సెకన్ల వ్యవధిలోనే అటుగా రాంగ్‌ రూట్లో వచ్చిన ఓ కారును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అక్షత్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గత ఆదివారం తెల్లవారుజామున 5:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కుమార్ తీసిన గోప్రో కెమెరాలో రికార్డు అయ్యింది. 17 సెకన్ల నిడివి గల వీడియోలో గార్గ్ వేగంగా వెళ్తుండటం చూడొచ్చు. రోడ్డు మలుపు తిరిగిన వెంటనే.. ఎదురుగా వస్తున్న బ్లాక్‌ SUV కారును ఢీకొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ప్రమాదం ధాటికి పెద్ద శబ్దం రావడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

DLF డౌన్‌టౌన్ నుంచి బయలుదేరిన అక్షత్‌ అంబియన్స్ మాల్‌లో రైడర్‌ల కలిసేందుకు బయలుదేరాడు. సికిందర్‌పూర్-సైబర్‌హబ్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత, వేగంగా వస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 300 అకస్మాత్తుగా రాంగ్ డైరెక్షన్‌లో రావడంతో రోడ్డు మలుపు వద్ద ఓ రాజకీయ పార్టీ స్టిక్కర్ ఉన్న కారు గార్గ్ మోటార్ సైకిల్‌ను వేగంగా ఢీకొట్టిందని మృతుడు అక్షత్‌ స్నేహితుడు కుమార్ తెలిపాడు. వెంటనే కారులోని ప్రయాణికులు అత్యవసర సేవలకు సమాచారం అందించారు. ఐదు నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి గార్గ్‌ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అయితే వైద్యులు అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు. ఈ ప్రమాదం గురించి ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో కారులోని వారికి ఎలాంటి ప్రాణహాని కలుగలేదు. బైక్‌ కారును ఢీకొట్టడంతో అక్షయ్‌ ఒక్కసారిగా పైకి ఎగిరి పడ్డాడు. బైక్‌ గుర్తుపట్టలేనంతగా విరిగిపోయినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.