Video: మీరు మనుషులేనా? మృగాలుగా మారి అమ్మాయి బట్టలు తీస్తుంటే.. చుట్టూ చేరి ఫోన్లలో..

Updated on: Apr 14, 2025 | 7:00 PM

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో మహిళా హిజాబ్‌ను బలవంతంగా తొలగించిన ఘటన వైరల్ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. ఘటనలో మహిళపై దాడి జరిగిందని, చుట్టుపక్కల వారు వీడియోలు తీస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఒక మహిళ తలపై ధరించిన వస్త్రాన్ని బలవంతంగా కొందరు వ్యక్తులు తొలగించిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో ఒక వ్యక్తి ఓ మహిళ హిజాబ్‌ను బలవంతంగా తొలగిస్తున్నట్లు చూడవచ్చు. అదనంగా ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడి కూడా చేశారు. పైగా అక్కడున్న వాళ్లు ఈ ఘటనను ఖండించకుండా.. సెల్‌ ఫోన్లలో వీడియోలు తీస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Apr 14, 2025 07:00 PM