Corona New Variant: అది మన వైరస్ కాదు.. డబ్ల్యూహెచ్‌వో కూడా ఎక్కడా వాడలేదు.. B.1.617 కరోనా​వేరియంట్‌పై కేంద్రం స్పష్టత

Corona New Variant: భారత్‌లో బయటపడ్డ B.1.617 కరోనా​వేరియంట్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్​ప్రతి రోజు వేలాది మందిని..

Corona New Variant: అది మన వైరస్ కాదు.. డబ్ల్యూహెచ్‌వో కూడా ఎక్కడా వాడలేదు.. B.1.617 కరోనా​వేరియంట్‌పై కేంద్రం స్పష్టత
Indian Variant
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 22, 2021 | 9:13 AM

Corona New Variant: భారత్‌లో బయటపడ్డ B.1.617 కరోనా​వేరియంట్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్​ప్రతి రోజు వేలాది మందిని బలి తీసుకుంటోంది. అయితే దీనిని ‘ఇండియన్​ వేరియంట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొన్నట్లు ఇటీవల కాలంలో మీడియాలో, సోషల్‌ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. ఈ వెరియంట్‌పై క్లారిటీ ఇచ్చింది. B.1.617 అనేది ‘ఇండియన్​ వేరియంట్’ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు లేవని, అంతేకాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన నివేదికల్లో ‘ఇండియన్​ వేరియంట్​’ అనే పదం ఎక్కడా వాడలేదని గుర్తుచేసింది. ఈ కొత్త వేరియంట్‌ ఇండియాది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, దీనిపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపింది. వైరస్, వాటి వివిధ రూపాలను అవి మొదట కనిపించిన దేశాల పేర్లతో గుర్తించడం లేదని.. వాటిని శాస్త్రీయ నామంతోనే గుర్తిస్తామని డబ్ల్యూహెచ్​ఓ ఇటీవల చెప్పిన విషయాన్ని వెల్లడించింది. దీంతో పాటు ప్రస్తుతం భారత్‌లో విజృంభిస్తున్న B.1.617 వేరియంట్​ 44 దేశాల్లో కన్పించిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించినట్లు వచ్చిన వార్తలపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ అంశంపై విడుదల చేసిన నివేదికలో ‘ఇండియన్​’ అనే పదాన్ని డబ్ల్యూహెచ్ఓ ఎక్కడా వాడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

44 దేశాల్లో B.1.617 వేరియంట్​..

కాగా, డబ్ల్యూహెచ్ఓ తాజాగా విడుదల చేసిన నివేదికలో B.1.617 వేరియంట్​ను ప్రపంచానికి ఆందోళనకరమైన వేరియంట్​గా అభివర్ణించింది. దీన్ని అక్టోబర్​లోనే భారత్​లో గుర్తించామని, ఆ తర్వాత ఇది ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం పేర్కొంది. ప్రస్తుతం 44 దేశాల్లో బయటపడ్డ ఈ వేరియంట్​ను​ తొలుత బ్రిటన్​, బ్రెజిల్​, దక్షిణాఫ్రికాల్లో గుర్తించినట్లు తెలిపింది. ఇది ఒరిజినల్​ వైరస్​ కంటే చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు కనిపిస్తుండటంతో దీనిని ఆందోళనకరమైన వేరియంట్ల జాబితాలో చేర్చినట్లు స్పష్టం చేసింది.

B.1.617 వేరియంట్‌ను డబుల్ మ్యూటెంట్‌గా కూడా పిలుస్తున్నట్లు, ఇది యాంటీబాడీస్​ను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడానికి కూడా ఈ వేరియంటే కారణమని పేర్కొంది. కాగా, భారత్​లోని సెకండ్ వేవ్​కు కారణమైన ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ చాలా మందిని బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవీ చదవండి:

Oxygen Supply: 42 విమానాలు.. 21 రోజులు.. 1400 గంటల ప్రయాణం.. విపత్కర పరిస్థితుల్లో భారత వాయుసేన గొప్ప సాయం

Telangana Corona Cases: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వ్యాప్తి.. క్రమంగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు..