నాలుగేళ్ల చిన్నారిపై సవతి తండ్రి దాష్టీకం..

| Edited By:

Dec 12, 2019 | 2:33 PM

బెలూన్ కావాలని అడగడం ఆ చిన్నారికి శాపమైంది. ఆడుకుటానంటూ తండ్రి దగ్గరకు వచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారి.. నాన్నా బెలూన్ కావాలి అని అడిగింది. అంతే.. ఆ తండ్రి ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. అతనిలో ఉన్న రాక్షసత్వం ఒక్కసారిగా బయటపడింది. బెలూన్ కావాలా అంటూ.. విచక్షణారహితంగా కొడుతూ.. చివరకు హతమార్చాడు. యూపీలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం నివ్వెరపోయేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని ఖుల్దాబాద్‌ సిద్ధార్థనగర్‌లో ఓ జంట నివసిస్తున్నారు. అయితే సరుకులు కొనేందుకు తన […]

నాలుగేళ్ల చిన్నారిపై సవతి తండ్రి దాష్టీకం..
Follow us on

బెలూన్ కావాలని అడగడం ఆ చిన్నారికి శాపమైంది. ఆడుకుటానంటూ తండ్రి దగ్గరకు వచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారి.. నాన్నా బెలూన్ కావాలి అని అడిగింది. అంతే.. ఆ తండ్రి ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. అతనిలో ఉన్న రాక్షసత్వం ఒక్కసారిగా బయటపడింది. బెలూన్ కావాలా అంటూ.. విచక్షణారహితంగా కొడుతూ.. చివరకు హతమార్చాడు. యూపీలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం నివ్వెరపోయేలా చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని ఖుల్దాబాద్‌ సిద్ధార్థనగర్‌లో ఓ జంట నివసిస్తున్నారు. అయితే సరుకులు కొనేందుకు తన కూతురితో మార్కెట్‌కు వెళ్లారు. అయితే అదేసమయంలో అక్కడ అందమైన రంగుల్లో బెలూన్లు కనిపించడంతో.. ఆ చిన్నారి తన సవతి తండ్రిని కోరింది. చిన్నారి బెలూన్ కావాలని కొరడంతో కోపోద్రిక్తుడైన ఆ సవతి తండ్రి.. క్షణం కూడా ఆలోచించకుండా విచక్షణా రహితంగా బాదాడు. అడ్డొచ్చిన భార్యను కూడా కిందపడేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా… ఆ చిన్నారిని బండిపై బయటికి తీసుకెళ్లి.. రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ఓ గదిలోకి తీసుకెళ్లి.. తలుపులు వేసుకున్నాడు. అయితే ఉదయం ఎంతటికీ డోర్లు తెరవకపోవడంతో.. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది ఆ చిన్నారి తల్లి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని డోర్ బద్దలు కొట్టి చూడగా.. ఆ చిన్నారి చనిపోయి కనిపించింది. ఆ పక్కనే స్పృహ కోల్పోయి నిందితుడు ఉన్నాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.