India Survey: దేశంలో పట్టణజీవులను కలవరపెడుతున్న ఆ రెండు సమస్యలు.. తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు

|

Sep 30, 2021 | 4:14 PM

What Worries the World: పట్టణ జీవితమంటేనే ఉరకలు పరుగుల జీవితం. బ్రతుకు బండి ముందుకు కదలాలంటే పట్టణజీవి అవిశ్రాంతంగా పరుగులు పెట్టాల్సిందే. అయితే కరోనా మహమ్మారి చాలా మంది పట్టణ జీవుల జీవితాలను తలకిందులు చేసింది.

India Survey: దేశంలో పట్టణజీవులను కలవరపెడుతున్న ఆ రెండు సమస్యలు.. తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు
India Urban People
Follow us on

What Worries the World: పట్టణ జీవితమంటేనే ఉరకలు పరుగుల జీవితం. బ్రతుకు బండి ముందుకు కదలాలంటే పట్టణజీవి అవిశ్రాంతంగా పరుగులు పెట్టాల్సిందే. అయితే కరోనా మహమ్మారి చాలా మంది పట్టణ జీవుల జీవితాలను తలకిందులు చేసింది. చాలా మంది తమ ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో పట్టణ జీవితాలపై భారత్ సహా పలు దేశాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశ పట్టణ ప్రజలను ఇప్పుడు ఎక్కువ ఆందోళనకు గురిచేస్తున్న సమస్యలు నిరుద్యోగం, కరోనా సమస్యలుగా ఆ సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఐపీసోస్ ఇండియా సంస్థ ‘ వాట్ వరీస్ ది వరల్డ్ మంత్లీ’ పేరిట ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న భారత పట్టణ ప్రజల్లో 42శాతం మంది తమను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం నిరుద్యోగ సమస్యగా వెల్లడించారు. అదే స్థాయిలో పట్టణ ప్రజలు (42శాతం) కరోనా పాండవిక్ తమను అత్యంత ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలిపారు.

మునుపటి నెలతో పోల్చితే కరోనా సంక్షోభాన్ని అతిపెద్ద సమస్యగా భావించేవారి సంఖ్య 5 శాతం తగ్గింది. అదే సమయంలో నిరుద్యోగ సమస్య పట్ల ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు అభిప్రాయపడిన వారి సంఖ్య 2 శాతం పెరిగింది. ఇక వీరిని ఆందోళనకు గురిచేస్తున్న మూడో అంశం అవినీతి సమస్య. సర్వేలో పాల్గొన్నవారిలో 28 శాతం మంది అవినీతిని తాము అతిపెద్ద సమస్యగా భావిస్తున్నట్లు తెలిపారు. నేరాలు, హింసను పెద్ద సమస్యగా భావిస్తున్నట్లు 25 శాతం, పేదరికం, అసమానతలను సమస్యగా భావిస్తున్నట్లు 24 శాతం, విద్య అంశాన్ని సమస్యగా భావిస్తున్నట్లు 21 శాతం మంది అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ స్థాయిలో కరోనా వైరస్(36శాతం) పట్ల ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు ఈ సర్వే తేల్చింది. అలాగే నిరుద్యోగ సమస్య (31), పేదరికం – అసమానతలు(31 శాతం), అవినీతి (27శాతం), నేరాలు- హింస(26 శాతం) పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న న సమస్యలుగా ఉన్నాయి.

కాగా దేశం సరైన మార్గంలో ముందుకు వెళ్తున్నట్లు 65 శాతం మంది భారతీయులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రపంచంలో అత్యధికంగా సౌదీ అరేబియాకు చెందిన 90 శాతం మంది ప్రజలు తమ దేశం సరైన మార్గంలో ముందుకు వెళ్తున్నట్లు అభిప్రాయపడ్డారు. దేశం సరైన మార్గంలో ముందుకు వెళ్లడం లేదని కొలంబియా(89శాతం), దక్షిణాఫ్రికా(85శాతం), పెరు(81 శాతం) దేశాల ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 28 దేశాల్లో నిర్వహించిన ఈ ఆన్‌లైన్ సర్వేలో దాదాపు 20 వేల మందికి పైగా పాల్గొన్నారు.

Also Read..

Posani Krishna Murali : దాడులు, బెదిరింపుల వల్ల మా మోరల్స్ ఎక్కడికీ పోవు.. మహా అయితే చంపేస్తారు అంతేగా..

Amarinder Singh-BJP: బీజేపీలోకి మాజీ సీఎం.. రంగం సిద్ధం చేసుకుంటున్న కెప్టెన్..